నీలా! మూటలు, పదవుల కోసం కాదు: ఎర్రబెల్లిపై సీతక్క తీవ్ర విమర్శలు

టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఇటీవలే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీతక్క,

హైదరాబాద్: టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఇటీవలే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీతక్క, రేవంత్ రెడ్డి పార్టీ మారడంపై ఎర్రబెల్లి ఇంతకుముందు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీతక్క మాట్లాడుతూ.. ఎర్రబెల్లిలా తాను పదవుల కోసమో, మూటల కోసమో పార్టీ మారలేదన్నారు. రేవంత్ కుటుంబం తనను ఇంటి ఆడబిడ్డాలా చూసుకుంటుందని, మూడేళ్లుగా రేవంత్‌తో కలిసి ప్రజాపోరాటం చేశానని తెలిపారు.

Seethakka Fires On Errabelli Dayakar Rao

రాష్ట్రంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఏకీకరణ జరగాలని సీతక్క అన్నారు. అందుకోసమే కాంగ్రెస్‌లో చేరానని, పదవుల కోసమైతే ఎర్రబెల్లిలా టీఆర్ఎస్‌లో చేరేదాన్ని అని విమర్శించారు. తనపై ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+