ఆధారాలు ఇవే.. కేటీఆర్ రాజీనామా చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలోని మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ పై మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేశారు. కేటీఆర్ ఇచ్చిన సవాల్‌కు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రూ. 57,000 కోట్లు రుణాలు ఇవ్వడమే కాకుండా వడ్డీ భారాన్ని సైతం ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. ఇప్పటివరకు రూ. 1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని మంత్రి సీతక్క తెలిపారు.

అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్‌ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ చూపెడితే తక్షణమే తాను రాజీనామా చేసి, శాశ్వతంగా బయటికి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. లేదంటే తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భట్టి రాజీనామా చేస్తారా..? అని అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ సవాల్ పై స్పందించిన మంత్రి సీతక్క అందుకు సంబంధించిన ఆధారాలను వెల్లడించారు.

Seethakka Releases Proof of 57 000 Cr Loans to Women SHGs Demands KTR Resign releases proof

ఈ మేరకు ఆధారాలు చూపిస్తూ.. కేటీఆర్ రాజీనామా చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. కేటీఆర్ తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని అన్నారు. మహిళా సంఘాలకు రూ. 57 వేల కోట్ల బ్యాంకింగ్ రుణాలు ఇస్తే రాజీనామా చేస్తా అన్నారు .. ఇదిగో ఆధారాలు అంటూ వెల్లడించారు. మహిళా సంఘాల వడ్డీ భారాన్ని కూడా భరిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,390 కోట్ల వడ్డీలను చెల్లించినట్లు ఆధారాలు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 4 వేల కోట్ల వడ్డీలను మహిళా సంఘాలకు ఎగ్గొట్టారని మండిపడ్డారు. మీరు అభయహస్తం నిధులను కాజేశారంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ మేరకు తక్షణమే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+