Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"సొంత చెల్లెకు న్యాయం చేయలేని కేటీఆర్.. మాగంటి ఫ్యామిలీకి ఎలా న్యాయం చేస్తారు..?"

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి చేసుకునే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు. పక్కా లోకల్ అయిన నవీన్ యాదవ్.. మీ కష్టసుఖాల్లో భాగం పంచుకునే వ్యక్తి అని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం.. ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ.. ప్రజల మనోభావాలను ప్రాంత అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

" పీజేఆర్(పి. జనార్ధన్ రెడ్డి) అంటే బ్రాండ్ అంబాసిడర్ అలాంటి పీజేఆర్ మరణిస్తే వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ కుటుంబం మీద టీఆర్ఎస్ 2008 లో అభ్యర్థిని నిలబెట్టింది. అంత పెద్ద మహా నాయకుడైన పీజేఆర్ పై పోటీ తీసుకొచ్చి సాంప్రదాయాలను తుంగలో తొక్కింది. తెలంగాణ కోసం ఫైట్ చేసిన నాయకుడి కుటుంబంపై కేసీఆర్ నాడు పోటీ పెట్టారు. 2008లో ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నా కేసీఆర్ కనికరించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులపై పోటీ నిలిపింది టీఆర్ఎస్. దివంగత నేతల కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నా కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

"కాంగ్రెస్.. ప్రజల మనోభావాలను ప్రాంత అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. పక్కా లోకల్ అయిన నవీన్ యాదవ్.. మీ కష్టసుఖాల్లో భాగం పంచుకునే వ్యక్తి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం.. ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ గుర్తుపై ఓటేసి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. పీజేఆర్ మరణంతో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి తెచ్చుకుందాం. ఎన్నో సంక్షేమ పథకాలను రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోంది. హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది" అని మంత్రి సీతక్క తెలిపారు.

"పేదల కడుపునిండా అన్నం తినేందుకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. పేదలకు ఉచితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వేల కోట్లు ఇప్పిస్తున్నాం. మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేస్తున్నాం. నవీన్ యాదవ్ గెలవడం పక్కా.. జూబ్లీహిల్స్ గల్లీల రూపురేఖలు మార్చడం పక్కా. ఒక్క అవకాశం నవీన్ కుమార్ యాదవ్ కు ఇవ్వండి మీకు సేవకుడిగా పనిచేస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఓటర్ ను కలవాలి. మన సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజలకు వివరించాలి. టీఆర్ఎస్ ఓటు దొంగలే దొంగ ఓట్లు అని అరుస్తున్నారు. పబ్బులు క్లబ్బులు డ్రగ్ సాగిపోయేసరికి ఏమి మాట్లాడుతున్నారో టీఆర్ఎస్ నాయకులకు తెలియడం లేదు" అని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు.

Seethakka s Rallying Cry Congress Naveen Yadav Urged to Clinch Jubilee Hills Victory

"2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓట్లే ఇప్పుడు ఉన్నాయి. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే టీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నిస్తే నేను అడ్డుకున్నానని స్వయంగా సొంత బిడ్డ కవిత చెప్పారు. సొంత చెల్లెనే మానసిక క్షోభానికి గురిచేసిన వ్యక్తి ఇతర ఆడబిడ్డలకు ఎలా న్యాయం చేస్తారు. మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని రాజకీయాల కోసం టీఆర్ఎస్ వాడుకుంటుంది. సొంత చెల్లెకు న్యాయం చేయలేని కేటీఆర్.. మాగంటి సతీమణికి ఎలా న్యాయం చేస్తారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది. మీ ఇంటి బిడ్డ మీకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్న నవీన్ యాదవ్ ను ఆశీర్వదించండి. గోపీనాథ్ కుటుంబాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు గెలిపించారు. అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు అభివృద్ధికి వేసినట్లే. కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడండి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం" అని మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+