Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ పాత ఫోన్‌ అమ్ముతున్నారా..? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే ..!

పాత ఫోన్లను ఇచ్చి ప్లాస్టిక్ లేదా స్టీల్ సామాను మార్పిడి చేసుకునే పద్ధతి మనకు తెలిసిందే. పాత వస్తువు పోయింది, కొత్త సామాను వచ్చింది అనుకుంటూ మనం సంబరపడిపోతాం. కానీ, మీరు తెలియకుండానే ఒక అత్యంత ప్రమాదకరమైన సైబర్ వలలో చిక్కుకున్నట్లే.మీరు నిరుపయోగంగా భావించి కేవలం కొద్దిపాటి సామానుకు అమ్మిన ఆ పాత మొబైల్ ఫోన్లు... ఇప్పుడు లక్షల రూపాయల మోసాలకు, సైబర్ నేరాలకు కేంద్రాలుగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో వెలుగు చూసిన సంచలన మోసం
హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఇలాంటి దారుణమైన సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాను పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాత ఫోన్లను సేకరించే ముసుగులో, ఈ ముఠా వాటిని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తోంది.

Selling Old Phones for Scraps Beware of the Cyber Trap Your Phone is Linked to Bank Fraud

మోసం ఎలా జరుగుతుందంటే?
పాత ఫోన్ సేకరణ వీధుల్లోకి వచ్చి, ప్లాస్టిక్ సామాను ఇస్తామంటూ మీ పాత స్మార్ట్‌ఫోన్లను సేకరిస్తారు.ఆ ఫోన్లలోని సిమ్ కార్డులు లేదా ఐడెంటిఫికేషన్‌ను ఉపయోగించి, ఇతరులకు ఓటీపీలు (OTP) మరియు ఫిషింగ్ మెసేజ్‌లు పంపుతారు. అమాయక ప్రజలను మోసగించి, వారి BANK ఖాతాల్లోని డబ్బును పూర్తిగా దోచేస్తున్నారు.

మీరు చేసిన తప్పు, వాళ్లకు అస్త్రం
ఈ ముఠాలు మోసానికి పాల్పడ్డా, నేరం మీ మీదికే వస్తుంది. ఎందుకంటే... ఆ పాత ఫోన్లు ఇప్పటికీ వాటిని అమ్మిన వారి పేరిటే రిజిస్టర్ అయి ఉన్నాయి. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఆ ఫోన్‌ను ట్రాక్ చేయగా, దాని యజమాని వివరాలు బయటపడతాయి. దీంతో అమాయకంగా పాత ఫోన్‌ను అమ్మిన వారు పోలీసు విచారణ, చట్టపరమైన చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఈ లొసుగును ఉపయోగించే ఆ ముఠాలు చట్టం నుంచి సులభంగా తప్పించుకుంటున్నారు.ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్న మరో ముఠా దుమ్ముగూడెం పోలీసులకు కూడా చిక్కడం ఈ నేరాల విస్తృతిని తెలియజేస్తోంది.

చిన్న మొత్తానికి, కొద్దిపాటి సామానుకు ఆశపడి మీరు వదిలించుకున్న పాత ఫోన్... మీ జీవితాన్ని, ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేయకుండా జాగ్రత్త వహించండి. ఈ మోసపు వలలో చిక్కుకోకుండా ఉండాలంటే, పాత ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల అప్రమత్తత చాలా అవసరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+