పెళ్లై, పిల్లలున్నారన్నా.. పెళ్లాడతానంటూ నటికి వేధింపులు, నిందితుడి అరెస్ట్
పెళ్లై, పిల్లలు ఉన్నారని చెప్పినా వినకుండా.. ఓ సీరియల్ నటిని పెళ్లి చేసుకుంటానంటూ వేధింపులకు గురిచేసిన యువకుడిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ (29) యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె డైలీ సీరియల్స్‌లో నటిస్తోంది.
సెప్టెంబర్ నెలలో ఓ సీరియల్‌లో నటిస్తున్న సమయంలో బత్తుల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ నెలలో వివాహం చేసుకుంటానని ఆమెకు చెప్పాడు ఫణితేజ. అయితే, తనకు పెళ్లై భర్తకు దూరంగా, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నానని చెప్పి.. ఆమె పెళ్లికి నిరాకరించింది.

ఈ క్రమంలో ఆమెకు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాడు ఫణితేజ. అంతేగాక, ఆమె అత్త ఇంటి చిరునామా తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమె గురించి చెడుగా చెప్పాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గాడు. అయితే, మళ్లీ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఆపలేదు.
తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని ఆమెకు సెల్ఫీ వీడియో పంపాడు. బాధితురాలి క్యారెక్టర్‌ను దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేయడతో పోలీసులు అతడిపై చర్యలకు అపక్రమించారు. ఫణితేజను అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications