దారుణం: ఏడేళ్ల బాలికపై 13 బాలుడి లైంగిక దాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో ఓ బస్తీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎల్బీనగర్‌లోని ఓ బస్తీలో రోజు కూలీ చేసుకునే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఏడేళ్ల కూతురు ఉంది.

బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. పాఠశాలకు సమీపంలోనే ఓ గుడిసె వేసుకుని వారు నివాసం ఉంటున్నారు. ఆ బాలిక చదువుతున్న పాఠశాలలో ఓ 13 ఏళ్ల బాలుడు చదువుతున్నాడు. వారిద్దరికి పరిచయం ఏర్పడింది. బాలుడి తల్లిదండ్రులు పాత దుస్తులు విక్రయిస్తుంటారు.

Seven year old girl raped by 13 year old boy

సోమవారం ఉదయం ఇద్దరి ఇళ్లలోని పెద్దవాళ్లు తమ తమ పనుల మీద వెళ్లిపోయారు. బోనాల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలిద్దరు ఇళ్ల వద్దే ఉండిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు సోమవారం మధ్యాహ్నం బాలుడు వచ్చాడు.

ఆడుకుందాం రమ్మంటూ బాలికను బయటకు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత వర్షం వస్తుందంటూ చెప్పి ఆమెను ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆ బాలికపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని బాలికను బెదిరించాడు.ట

తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ బాలిక ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాలికను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A seven year old girl has been raped by a 13 year old boy at LB Nagar in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి