ఉద్యోగం ఇప్పిస్తామని.. వ్యభిచార గృహాలకు యువతుల విక్రయం: ముఠా అరెస్ట్

ఆదిలాబాద్: ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. గిరిజన యువతులను ఉత్తరాది రాష్ర్టాల్లో విక్రయిస్తున్న ముఠాగుట్టు రట్టయింది. బంధువులు, తెలిసినవారే అక్రమ రవాణా చేస్తుండగా.. అదే గిరిజనులు వలపన్ని ఆ దుర్మార్గుల ఆట కట్టించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో ఇంద్రవెల్లి మండలం గోపాల్‌సింగ్‌తండాకు చెందిన నిస్తే హరిసింగ్, ఇదే మండలంలోని పిప్రికి చెందిన చహకటి జంగు, కెస్లాగూడకు చెందిన మడావి భీంరావ్‌లు ముఠాగా ఏర్పడ్డారు. ఉట్నూర్ మండలం సాలెవాడ-బి గ్రామానికి చెందిన ఓ యువతికి ఉపాధి కల్పిస్తామని తీసుకెళ్లి రాజస్థాన్‌లోని ముడుదమ్మ ప్రాంతానికి తరలించి చంద్రకాంత్ అనే వ్యక్తికి రూ.1.3 లక్షలకు విక్రయించారు.

నార్నూర్ మండలం ఖడ్కికి చెందిన మరో యువతిని కూడా విక్రయించారు. 15 రోజుల కిందట మొదటి యువతి.. తన అన్నకు ఫోన్‌చేసి ఈ విషయం చెప్పింది. కొనుగోలు చేసినవాళ్లు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారని వివరించింది. బాధితురాలి అన్న కులపెద్దలతో చర్చించి మూడు గ్రూపులుగా ఏర్పడి నిందితులు హరిసింగ్, చహకటి జంగు, మడావి భీంరావ్‌లను పట్టుకుని శనివారం పోలీసులకు అప్పగించారు.

Sex racket busted in Adilabad district and accused arrested by Police

ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ శ్రీనివాస్ నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వెంకట్వేర్లు రాజస్థాన్‌లో ఉన్న బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత యువతుల కోసం రాజస్థాన్ వెళ్తామన్నారు.

గతంలోనూ కెరమెరి, నార్నూరు మండలాల నుంచి కొందరిని తీసుకెళ్లి విక్రయించారు. కాగా, వాళ్లంతా ఇష్టపూర్వకంగానే వెళ్లి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు. వాంకిడి, ఆసిఫాబాద్, కెరమెరి, నార్నూరు, ఉ ట్నూరు, జైనూరు, ఇంద్రవెల్లి, మంచిర్యాల, బేల మండలాల నుంచి బాలికలు అక్రమ రవాణా అవుతున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది.

మరోవైపు పెళ్లిళ్లు చేయలేని తల్లిదండ్రులు డబ్బులకు ఆశపడి అమ్మాయిలను అప్పగిస్తున్నారు. కొనుగోలు చేసిన యువతులతో ఆయా రాష్ర్టాల్లోని వ్యక్తులు కొంతకాలం కాపురం చేసి తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలోని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్‌పూర్, బల్హార్షల్లోని లాడ్జీలు, వ్యభిచార గృహాలపై పోలీసుల దాడుల్లో జిల్లాకు చెందిన యువతులు, బాలికలు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+