హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 7గురి అరెస్ట్, 3కార్లు సీజ్
హైదరాబాద్: నగరంలో హైటెక్ పద్ధతుల్లో నడిపే వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వెస్ట్‌జోన్ పరిధిలో జరిపిన దాడుల్లో ఏడుగుర్ని అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు.
ఎనిమిదేళ్లుగా జంట నగరాలలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న గాంధీనగర్ ఎస్‌బీఐ కాలనీకి చెందిన ఎం వీరబాబు అలియాస్ శేఖర్, కూకట్‌పల్లికి చెందిన రమేష్, వ్యభిచార గృహాల్లో బ్రోకర్లుగా పనిచేస్తున్న టోలిచౌకీ బృందావన్‌కాలనీకి చెందిన మహ్మద్ ఖలీల్ అలియాస్ సల్మాన్, లంగర్‌హౌస్‌కు చెందిన మహేష్‌రాఠి అలియాస్ మహ్మద్ సమీ అలియాస్ సమీర్, అత్తాపూర్‌కు చెందిన దీప్‌చంద్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అభిజిత్ విశ్వాస్, డ్రైవర్ బంగారయ్య పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఇతర నగరాల నుంచి మహిళలను నగరానికి తీసుకువచ్చి కస్టమర్ల కోరిక మేరకు వివిధ హోటళ్లకు పంపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఓ వెబ్‌సైట్‌లో మహిళల ఫొటోలు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తూ హైటెక్ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగుర్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డిసిపి లింబారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఇన్స్‌పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి బృందం సభ్యులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications