పార్లర్ పేరుతో సెక్స్ రాకెట్: అమ్మాయిల్ని తీసుకొచ్చి.., టెక్కీల అరెస్ట్
హైదరాబాద్: బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచార ముఠా నడుస్తుండటంతో పోలీసులు దానిని రట్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాదులో సోమవారం నాడు జరిగింది. హయత్‌నగర్‌కు చెందిన వీరస్వామి మూసారాంబాగ్‌లో ఓ బ్యూటీపార్లర్ నడుపుతున్నాడు.
ఏపీలోని ఏలూరు, తెలంగాణలోని నల్గొండ ప్రాంతాలకు చెందిన శ్రీకాంత్, దామోదర్‌లతో కలిసి అతను బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. అయితే, ఆ బ్యూటీ పార్లర్ ముసుగులో అతను వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.

ఏపీ, కోల్‌కతా, బెంగళూరు నుంచి యువతులను తీసుకు వచ్చి ఈ రొంపిలో దింపుతున్నారు. దీని పైన సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం దాడి చేశారు.
వీరస్వామి, శ్రీకాంత్, దామోదర్‌లను అరెస్టు చేశారు. విటులుగా వచ్చిన ఇద్దరు సాఫ్టువెర్ ఇంజినీర్లను కూడా అరెస్టు చేశారని తెలుస్తోంది. నలుగురు యువతులకు విముక్తి కలిగించారు. వారి నుంచి నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications