సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 4గురు యువతులు, 6గురు విటులు అరెస్ట్

Subscribe to Oneindia Telugu

ఖమ్మం: గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నగరంలోని త్రీటౌన్ పరిధిలో కొంతకాలంగా ఈ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈ మేరకు వివారలను సీఐ మొగిలి మీడియాకు వెల్లడించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ వ్యవసాయ మార్కెట్ రోడ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతోంది. విటులను వాట్సాఫ్, సెల్‌ఫోన్‌లో ఆకర్షిస్తూ అమ్మాయిలను రప్పిస్తూ ఉంటుంది.

 Sex Racket busted in Khammam

ఖచ్చితమైన సమాచారం మేరకు సీఐ మొగిలి ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ బాబు, ఐటీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ తోటకూరి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడి చేయగా వ్యభిచారంతో పాటు పేకాటను సైతం నడిపిస్తున్నట్లు బయటపడింది.

దీంతో పోలీసులు అక్కడ ఉన్న నలుగురు యువతులు, విటులైన మండల నవీన్, షేక్ ఆరీఫ్, కురం వెంకటేశ్వర్లు, షేక్ షరీఫ్, మలీదు జగన్, షరీఫ్ పాషాలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 9300 నగదు, 7సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sex Racket busted in Khammam and 8 persons arrested.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి