అద్దె ఇంట్లో విదేశీ మైనర్లతో వ్యభిచారం: నిర్వాహకుల అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశీయుడితో పాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యభిచారం గృహం నుంచి ఇద్దరు మైనర్‌ బాలికలను రక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్, అరాంధారా తాలూకా, సిరిపురా గ్రామానికి చెందిన అబ్దుల్‌ బారిఖ్‌ షేక్‌ అలియాస్‌ రాజు(44) మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి, ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి బంగ్లాదేశ్‌కు చెందిన షిరాజుల్‌ ఇస్లాం(19)తో పరిచయం ఏర్పడింది.

Sex racket busted, minor Bangladeshi girl rescued

బంగ్లాదేశ్‌ నుంచి యువతులను తీసుకువస్తానని అందుకుగాను రోజుకు రూ.15వేలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నాడు. బారిఖ్‌ షేక్‌ నాలుగు నెలల క్రితం లంగర్‌హౌస్‌, బాపునగర్‌, న్యూ మయూరి స్వీట్స్ ప్రాంతంలో నెలకు రూ.6వేలు చెల్లించి, ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

Donald Trump’s Daughter Ivanka Trump Scheduled to visit Hyderabad

బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్‌ బాలికలతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం నగరానికి వచ్చిన సిరాజుల్‌ ఇస్లాం కూడా నగరానికి వచ్చి లంగర్‌హౌస్‌ బాపూనగర్‌లోనే ఉంటున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ రాజా వెంకటరెడ్డి, డీసీపీ లింబారెడ్డి ఆదేశాలతో నిందితులు అబ్దుల్‌ బారిఖ్‌ షేక్‌, షిరాజుల్‌ ఇస్తాంలను అరెస్టు చేశారు. బాలికలను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Task Force team raided a brothel under Langar Houz police station limits and rescued two minor girls who hailed from Bangladesh.
Please Wait while comments are loading...