ఎంటర్ ప్రైజెస్ పేరుతో వ్యభిచారం: మహిళా నిర్వాహకురాలితోపాటు ఇద్దరు యువతుల అరెస్ట్
ఆదిలాబాద్: ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయం పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది.
ఈ మేరకు వివరాలను బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సంప్రీత్‌సింగ్ తెలియజేశారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ఓ ముఠా అందులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళా నిర్వహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు.
లారీ, బైకు ఢీ: ఇద్దరికి గాయాలు
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో బుధవారం ఉదయం లారీ, మోటారు సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications