Durgam Chinnaiah: నిన్న రాజయ్య, నేడు చిన్నయ్య.. ఎమ్మెల్యేలపై లైంగిక ఆరోపణలు..!

స్టేషన్‍ఘన్‍పూర్ ఎమ్మెల్యే రాజయ్య పై ఓ సర్పంచ్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం మరవకముందే తాజాగా మరో ఎమ్మెల్యే పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే పై ఓ యువతి పలు ఆరోపణలు చేసింది. దుర్గం చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని చెప్పింది. తమ వద్ద డబ్బు తీసుకుని జైలు పంపించాడని ఆరోపించింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెయిరీ ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా దుర్గం చిన్నయ్య వద్దకు వెళ్లామని ఆమె చెప్పింది. డెయిరీ ఏర్పాటు చేసుకోండి కానీ.. తమకు తెలిసిన వారికి వాటా ఇవ్వాలని కోరినట్లు వివరించింది. అలా చేస్తే తన మద్దతుతోపాటు ఏం కావాలన్న చేస్తామని ఎమ్మెల్యే చెప్పినట్లు పేర్కొంది.

Sexual Accusations on bellampally MLA Durgam Chinnaih

ఎమ్మెల్యే ప్రతిపాదన ఒకే చెప్పి వారికి సంబంధించిన వారికి వాటా ఇచ్చామని చెప్పారు. రెండెకరాల భూమి కూడా ఇచ్చారని ఆమె తెలిపింది. బిజినెస్ గురించి చిన్నయ్యను కలవడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లేవాళ్లమని చెప్పింది. ఈ క్రమంలో తమతో పాటు తమ కంపెనీలో పని చేసే అమ్మాయిని తీసుకెళ్లామని. ఆమెను చూసిన ఎమ్మెల్యే తన వద్ద పంపాలని కోరినట్లు యువతి పేర్కొంది.

దానికి తాము ఒప్పుకోలేదని.. ఒత్తిడి పెరగడంతో చేసేది ఏమి లేక బ్రోకర్ నెంబర్లు తెలుసుకుని ఆయనకు పంపించామని చెప్పింది. వాళ్లతో ఆయన టచ్ లో ఉన్నట్లు యువతి తెలిపింది. తనతో బలవంతంగా మద్యం తాగించాలని చూశాడని ఆరోపించింది. ఆ తర్వాత తమను అరెస్ట్ చేయించాడని వివరించింది. యువతి ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+