దారుణం: టోలిచౌకిలో 3వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి, పాఠశాలలో విధ్వంసం, ఉద్రిక్తత

హైదరాబాద్: నగరంలోని టోలిచౌకిలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో తరగతి విద్యార్థినిపై స్కూల్ సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హైదరాబాద్ లోని టోలిచౌకి అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక నీరసంగా కనపడుతుండటంతో నీలోఫర్ హాస్పిటల్‌కు తల్లిదండ్రులు తీసుకువెళ్లారు.

Sexual Assault On 3rd Class Student Girl In Tolichowki Hyderabad

వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అత్యాచారానికి గురైనట్టు నిర్ధారించారు. స్కూల్ యాజమాన్యంలో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, బాధిత బాలిక బంధువులు స్థానిక అజాన్ ఇంటర్నేషనల్ స్కూలు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. స్కూలుపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అదనపు బలగాలను దింపి స్కూలు వద్ద మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+