మద్యం మత్తులో మూడున్నరేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడు
ఏం మారలేదు... బాలికా సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, ఉరి శిక్షలు వంటి కఠిన శిక్షలు వేస్తామని చెప్తున్నా అత్యాచారాలు ఆగలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారుల జీవితాలను కామపిశాచులు చిద్రం చేస్తూనే ఉన్నారు. మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న పశు ప్రవృత్తికి తాజాగా జరుగుతున్న ఘటనలే ఒక ఉదాహరణ . పోక్సో వంటి చట్టాల్లో సవరణలు చేసినా సరే పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి .
తాగిన మత్తులో మూడున్నరేళ్ళ చిన్నారిపై పశువులా ప్రవర్తించాడు ఓ మృగాడు. ఫుల్ గా మద్యం సేవించి ఏం చేస్తున్నాడో తెలియని విచక్షణా జ్ఞానం కోల్పోయిన వ్యక్తి ఆడుకుంటూ ఒంటరిగా కనిపించిన మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరలాను చూస్తే పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కలివేముల పాపయ్య (38) అనే వ్యక్తి ఒంటరిగా ఆడుకుంటూ కనిపించిన చిన్నారిని చూసి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికొచ్చిన కుమార్తెను చూసిన తల్లి ఆరా తీయగా ఆ పాప ఆటను చేసిన ఘాతుకాన్ని తల్లికి చెప్పింది. దీంతో అసలు విషయం బయటపడింది.

అనంతరం భర్త సాయంతో సదరు కలివేముల పాపయ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పాపయ్యను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా రోజుకో చోట పసి మొగ్గలను చిదిమేస్తుంటే , బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా ఈ దారుణాలకు అడ్డుకట్ట ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇలాంటి దారుణాలు నిత్య కృత్యంగా మారటం సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications