విద్యార్థినులపై మేనమామ లైంగిక వేధింపులు, బాధితులు ఏం చేశారంటే?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై మేనమామే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై మేనమామే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన స్కూల్ సిబ్బంది బాలికలను బాలల హక్కుల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గగన్ పహాద్ బాలికల హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్నారు. వారి తల్లి లక్ష్మీ పన్నెండేళ్ళ క్రితమే మరణించింది.

తండ్రి ఎక్కడెక్కడో తిరుగుతూ చివరకు కన్పించకుండాపోయాడు. వారిద్దరూ కూడ గగన్ పహాడ్ లోని మేనమామ చంద్రశేఖర్ వద్ద పెరుగుతున్నారు. అయితే మేనమామ చంద్రశేఖర్ ఆ ఇద్దరు విద్యార్థినులను వేదింపులకు గురిచేస్తున్నాడు.
నిద్రిస్తున్నప్పడు చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని బాలికలు స్కూల్ సిబ్బందికి తెలిపారు. స్కూల్ సిబ్బంది బాలల సంరక్షణ కేంద్రానికి సమాచారమిచ్చారు. ఇద్దరు బాలికలు బాలల సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇంతకాలం పాటు మేనమామ వద్దే పెరిగినందున చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేయడం లేదని బాలికలు చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications