ఘోరం: మహిళా లెక్చరర్లకు లైంగిక వేధింపులు

డైరెక్టర్ వేధింపులు ఎక్కువయ్యాయని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. డైరెక్టర్ వేధింపుల పైన విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులు కళాశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి
అదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని వేంపల్లి గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జువ్వ రామస్వామి(40)అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ముల్కల్ల గ్రామానికి చెందిన రామస్వామి ఇందారం ఐకె1ఎలో కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సెకండ్ షిఫ్ట్‌లో విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు.
విధులు ముగించుకొని మోటర్ సైకిల్‌పై తిరిగివస్తూ వేంపల్లి సింగరేణి చెక్‌పోస్ట్ సమీపంలో ఎదురుగా వస్తున్న గేదెను గమనించక వేగంతో ఢీ కొట్టాడు. దీంతో అతనికి తలకు తీవ్ర గాయలయ్యాయి. 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఏరియాసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో పాత మంచిర్యాల వద్ద రామస్వామి మృతి చెందాడు. కాగా అతనికి భార్య , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మెదక్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చాకలి ఎల్లప్ప(25) ఆర్థిక పరిస్థితు లు, అప్పుల బాధతో మానసికంగా కృంగిపోయి గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
పులిచర్మం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
రంగారెడ్డి జిల్లాలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో ఓ వ్యక్తి పులి చర్మాన్ని విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయఘడ్‌కు చెందిన సత్యనారాయణ (70) కొంపల్లిలోని సాయికృప అపార్ట్‌మెంటు లో నివాసం ఉంటూ మేడ్చల్ మండలంలోని అపరెల్ పార్కులో గల చర్మాస్‌లో టైలర్‌గా పని చేస్తున్నాడు.
కాగా సత్యనారాయణ రాయఘడ్ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి నుంచి పులి చర్మాన్ని రూ. 15 వేలకు కొని రూ. 7 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఓఎస్‌డీ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వలపన్ని బుధవారం మధ్యాహ్నం గుండ్లపోచంపల్లిలో పులిచర్మాన్ని అమ్ముతుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకుని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications