కెసిఆర్ అబద్దాలు 180, ముస్లీం రిజర్వేషన్ సాధ్యం కాదు: షబ్బీర్, 'ఏపీ-టి చంటిపిల్లలు'

హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 180 అబద్దాలు చెప్పారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ బుధవారం అన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని కెసిఆర్ చెప్పారని, కానీ అది సాధ్యం కాదని చెప్పారు.

ఇప్పటి వరకు కేసిఆర్ తాను ఇచ్చిన హామీలలో మూడింటిని మాత్రమే నెరవేర్చారని చెప్పారు. పద్దెనిమిదింటిని పాక్షికంగా అమలు చేశారన్నారు. కెసిఆర్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర పార్టీలను విచ్చిన్నం చేయడమే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. టిఆర్ఎస్ అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను హత్య చేస్తుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారన్నారు.

Shabbir Ali counter to KCR on 12 percent reservations to Muslims

బీహార్ రాష్ట్రానికి ప్యాకేజీని మార్కెట్లో వేలం మాదిరిగా ప్రకటించడం దారుణమన్నారు. ఎన్నికల లబ్ధి కోసమే బీహార్ రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించారన్నారు. చంటి పిల్లలాంటి తెలంగాణ, ఏపీలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి నిధులు రావడం లేదన్నారు.

చీప్ లిక్కర్ పైన విహెచ్ ఆగ్రహం

చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ రాజ్యచసభ సభ్యులు వి హనుమంత రావు వేరుగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలన్నారు.

డీకే అరుణవి అవాస్తవాలు: కర్నె

డీకే అరుణ మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. అరుణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళ పరుస్తుందన్నారు. కేసీఆర్ ఇలాకాలో ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందనడం అవివేకమన్నారు. ఆమె ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తప్పు చేస్తే సొంత వాళ్లనైనా వదలిపెట్టనని కేసీఆర్ చెప్పారన్నారు. బద్నాం చేయాలనుకుంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

నాగంపై వినయ్ భాస్కర్ ఆగ్రహం

తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఓయులో విద్యార్థుల చేత దెబ్బలు తిన్నాకే నాగంకు తెలంగాణ గుర్తొచ్చిందన్నారు. తెలంగాణ బచావోకు బిజెపి పార్టీ మద్దతుందా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+