టీ పీసీసీ వర్కింగె్ ప్రెసిడెంట్‌గా షబ్బీర్ అలీ..? ప్రకటించడమే తరువాయి..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ప్రక్షాలన చేయాలని అనుకుంటోంది. టీ పీసీసీ చీఫ్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్.. వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించనుంది. దీనికి సంబంధించి కసరత్తు జరగగా..ప్రకటించడే మిగిలి పోయింది. టీ పీసీసీ చీఫ్ సంగతి పక్కన పెడితే.. వర్కింగ్ ప్రెసిడెంట్‌పై క్లారిటీ వచ్చింది. షబ్బీర్ అలీకి పదవీ ఖాయం అని తెలుస్తోంది.

 కార్యవర్గ కూర్పుపై ఫోకస్..

కార్యవర్గ కూర్పుపై ఫోకస్..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ హైకమాండ్ప్రయత్నిస్తోంది. టీ పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై కసరత్తు చేస్తోంది. పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీకి కీలక పదవీ ఇచ్చే ఛాన్స్ ఉంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా షబ్బీర్‌ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. యువజన కాంగ్రెస్‌ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్‌ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవీని చేపట్టారు.

మంత్రిగా పనిచేసి..

మంత్రిగా పనిచేసి..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీసీ పెద్దలతో షబ్బీర్ ‌అలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 మైనార్టీ నేత..

మైనార్టీ నేత..

మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్‌ అలీని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. పార్టీలో కుమ్ములాట నేపథ్యంలో టీ పీసీసీ చీఫ్ ప్రకటించడం ఆలస్యమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+