కేటీఆర్ కు షర్మిల మద్దతు - అందరూ కలిసి రావాలి : అలాంటివి సహించేది లేదు..!!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతంలో మంత్రి కేటీఆర్ ఎవరంటూ ప్రశ్నించిన షర్మిల..ఆ తరువాత రాజకీయంగా అనేక విమర్శలు చేసారు. కానీ, ఇప్పుడు ఒక కీలకమైన అంశం లో మంత్రి కేటీఆర్ కు మద్దతుగా నిలిచారు. బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్విటర్ వేదికగా కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరిచేలా ట్వీట్ చేశారు. అభివృద్ది ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తూ.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలాగా ట్విటర్‌లో తీన్మార్ మల్లన్న పోస్టు చేసినట్లు సమాచారం.

తీన్మార్ మల్లన్న పోస్టు కలకలం

తీన్మార్ మల్లన్న పోస్టు కలకలం

దీనిపై మంత్రి కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్విట్ చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుపై ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులు తీన్మార్‌ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. బోడుప్పల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

కేటీఆర్ సీరియస్..నడ్డాకు ఫిర్యాదు

కేటీఆర్ సీరియస్..నడ్డాకు ఫిర్యాదు

శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్‌ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు.బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న ట్వీట్ పైన కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు. న కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మద్దతుగా నిలిచిన షర్మిల

దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దంటూ మంత్రి కోరారు. ఈ వ్యవహారం పైన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ''పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి'' అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+