యువతిపై అసభ్యంగా: ఇదే ఏరియాలో ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపు

హైదరాబాద్: ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఇదే ఏరియాలో ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించిన యువకుడిని ఓ యువతి షీ టీమ్స్‌కు పట్టించింది. అతను అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలను చిత్రీకరించి, అతన్ని షీ టీమ్స్‌‌కు సమాచారం ఇచ్చింది.

ఆ యువకుడిని షీటీమ్స్ అదుపులోకి తీసుకుని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నెం-5లోని దేవరకొండ బస్తీలో నివాసం ఉంటున్న సొహైల్(25) విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ నెల 8న బంజారాహిల్స్ రోడ్ నెం-1లోని జీవీకే మాల్ ఎదురుగా తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.

 She teams arrested sohail for abusing a girl

అదే సమయంలో ముషీరాబాద్‌కు చెందిన ఐశ్వర్య అనే యువతి తన వదినతో కలిసి షాపింగ్ ముగించుకుని రోడ్డు దాటేందుకు నిలబడింది. ఈ క్రమంలో బైక్‌పై సొహైల్ వేగంగా వచ్చి ఐశ్వర్యను ఢీకొట్టేలా బైక్ నడిపాడు. అలాగే, అసభ్యకర కామెంట్లు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో యువతి వెంటనే తన మొబైల్‌తో నిందితుడి ఫొటోలు తీసి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది.

బైక్ నెంబర్ ఆధారంగా సొహైల్‌ను గుర్తించిన షీటీమ్స్ బుధవారం దేవరకొండ బస్తీకి వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+