Shejal:ఆ ఎమ్మెల్యే పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శేజల్ ఆత్మహత్యాయత్నం..!
Durgam Chinnaiah:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కొన్ని నెలల క్రితం ఆరోపణలు చేసిన శేజల్ అనే యువతి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని పెద్దమ్మగుడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు శేజల్ రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో నిద్రమాత్రలు ఉండటంతో శేజల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఇక శేజల్ రాసిన సూసైడ్‌నోట్‌లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనకు న్యాయం ఎవరూ చేయలేకపోయారని పెద్దమ్మ తల్లి అయినా న్యాయం చేయాలని ఆ సూసైడ్ లెటర్‌లో రాసి ఉంది. దుర్గం చిన్నయ్య తనను కొన్ని నెలలుగా లైంగికంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ న్యాయపోరాటం చేస్తున్నట్లు లేఖలో పేర్కొంది. అయితే ప్రభుత్వంలోని మంత్రులు కొన్ని రోజులకైనా తన ఆవేదనను అర్థం చేసుకుంటారని భావించినప్పటికీ అది జరగలేదని వెల్లడించింది.

తాను ఇదివరకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ ఇంటి ముందు నిరసన తెలిపిన సమయంలో మంత్రి కేటీఆర్ తనను లోపలికి పిలిచి మాట్లాడారంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.అక్కడే ఉన్న ముగ్గురు పార్టీ పెద్దలు తనకు న్యాయం చేస్తారని చెప్పారని, దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు లేఖలో వివరించింది శేజల్. అంతేకాదు తనపై, తన కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తివేయిస్తామని స్పష్టం చేసినట్లు లేఖలో రాసింది. ఇక తమకు భూమి ఇచ్చి తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు శేజల్ పేర్కొంది.

అంతేకాదు తనపై, తన కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తివేయిస్తామని స్పష్టం చేసినట్లు లేఖలో రాసింది. ఇక తమకు భూమి ఇచ్చి తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు శేజల్ పేర్కొంది.దుర్గం చిన్నయ్య తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు లేఖలో చేసింది.ఇదే విషయమై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఒక కేసు కూడా నమోదు చేయలేదని చెప్పుకొచ్చింది.

తన ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తున్నారని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని లేఖలో పేర్కొంది. ఎవరు వచ్చి ఎప్పుడు చంపుతారో అనే భయం తనకు ఏర్పడిందని చెప్పిన శేజల్ తనకు ఇక న్యాయం జరగదని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తాను చనిపోయిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని అందుకే సూసైడ్ లెటర్ రాస్తున్నట్లు వివరించింది.
Shejal:ఆ ఎమ్మెల్యే పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శేజల్ ఆత్మహత్యాయత్నం..!#Sejal #SejalIncident #DurgamChinnaiah #Telangana #Oneindiatelugu pic.twitter.com/N8Smf0a2TU
— oneindiatelugu (@oneindiatelugu) June 29, 2023












Click it and Unblock the Notifications