సర్వం శివోహం.. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చెప్పిందిదే!

తెలుగు రాష్ట్రాలలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని వేయి స్తంభాల దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ కట్టారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిషేకాలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.ఆలయాలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ ఏర్పాట్లు చేశారు. అనేక ఆలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

తెలంగాణా, ఏపీలో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదగిరిగుట్ట ఝరాసంగం,కీసర, కాళేశ్వరం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగి పోతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి లోను భక్తజనం స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. అమరావతి అమరలింగేశ్వర స్వామితో పంచారామ క్షేత్రాలన్నీ సర్వం శివోహం అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం, మహానంది, పంచరామ క్షేత్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు.

shivoham This is what the CMs revanth and chandrababu said on the occasion of Maha shivratri

మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శివుడిని ప్రార్థించారు. శివరాత్రి ఉపవాస పూజలను నిర్వహిస్తున్న భక్తులందరికీ ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పవిత్ర భూమి మన రాష్ట్రంలోనే ఉందని చంద్రబాబు ఎప్పుడైనా శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది అన్నారు. ఈ పర్వదినాన శివారాధన తో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. శివార్చన, జాగరణలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+