కేసీఆర్ కు ఊహించని షాక్.. విలీనం దిశగా బీఆర్ఎస్!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల్లో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు కెసిఆర్ కు షాక్ ఇచ్చాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేయడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తర్వాత మహారాష్ట్ర పైనే పెద్ద ఎత్తున ఫోకస్ చేసి మహారాష్ట్రలో పార్టీని ఏర్పాటు చేశారు.
అగమ్యగోచరంగా బీఆర్ఎస్ పరిస్థితి
అనేకమార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను సైతం నిర్వహించి అక్కడి నేతలను ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై నోరెత్తలేదు. ఇప్పటివరకు జాతీయ రాజకీయాల పైన దృష్టి సారించలేదు. రాష్ట్రంలోనే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి నేతల పార్టీ రాయింపులతో అగమ్యగోచరంగా తయారైంది.

శరద్ పవార్ ను కలవనున్న బీఆర్ఎస్ మహా నాయకులు
ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని బిఆర్ఎస్ పార్టీలోని నాయకులు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారు అన్న వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాణిక్ రావుతో సహా పార్టీ ముఖ్య నేతలు ఈరోజు ఎన్సీపీ నేత శరత్ పవార్ ను కలవనున్నట్టు సమాచారం.
అక్టోబర్ 6న ఎన్సీపీలో చేరిక
ఈరోజు మహారాష్ట్ర బి ఆర్ ఎస్ నేతలు ఆయనతో కీలక భేటీ నిర్వహించిన తర్వాత అక్టోబర్ 6వ తేదీన పూణేలో ఎన్సిపి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో డిఆర్ఎస్ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అక్కడ బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పరిణామం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఊహించని పరిణామం.
బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలై గద్దె దిగిన పరిస్థితి
తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ్ కి నేతగా చెప్పుకున్న బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. ప్రధానంగా బిజెపిని టార్గెట్ చేసి మోడీ సర్కార్ ని గద్దె దించాలని శతవిధాల ప్రయత్నం చేశారు అయితే తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలై గద్దె దిగిన పరిస్థితి వచ్చింది.

బి ఆర్ ఎస్ వైపు చూసిన వారంతా ఇప్పుడు పక్క చూపులు
ఘోర పరాజయం తర్వాత ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోకముందే కేసీఆర్ తనయ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై జైలు పాలు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ మరింత కుదేలైంది. దీంతో కేసీఆర్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్ గా ఉండడంతో ఆయా రాష్ట్రాలలో బి ఆర్ ఎస్ వైపు చూసిన వారంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.
గులాబీ బాస్ ఏం చేస్తారో
ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బిఆర్ఎస్ పార్టీ నేతలంతా శరత్ పవార్ ఎన్సీపీలో చేరి పార్టీని విలీనం చేయనున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .తెలంగాణ రాష్ట్రం తర్వాత కాస్త కూస్తో పట్టు సాధించిన మహారాష్ట్రలో పార్టీ నేతలు అంతా జంప్ అవుతున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి పైన, జాతీయ రాజకీయాల పైన గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications