Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ సీపీ సజ్జనార్ కి షాక్.. ఆయన పేరుతోనే ఏకంగా..

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య కంటే ఎక్కువగా సైబర్ నేరాలను కట్టడి చేయడానికి పోలీసులకు సమయం సరిపోతుంది. రోజుకో రకంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలపైన అవగాహన లేని ఎంతోమంది బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఆధార్ కార్డు అప్డేషన్ అంటూ, whatsapp అప్డేషన్ అంటూ, బ్యాంకు నుంచి కాల్ చేసాము ఓటిపి చెప్పమని ఇలా రకరకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

ఫేక్ ఖాతాలతో సైబర్ మోసాలు
ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, whatsapp ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లను తెగ వాడేస్తున్నారు. ఫేక్ ఖాతాలను క్రియేట్ చేసి డబ్బులు కావాలని వాళ్లకు తెలిసిన బంధువులు, స్నేహితులకు పంపి డబ్బులు కొల్లగొడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ సైబర్ నేరాలను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిరోజు సైబర్ మోసాలతో జరుగుతున్న దోపిడీని అరికట్టడం పెద్ద సమస్యగా మారింది.

shock for Hyderabad CP Sajjanar fake facebook account in his name by cycer criminals

Take a Poll

సజ్జనార్ పేరుతోనే నకిలీ ఖాతా.. సైబర్ నేరగాళ్ళ షాక్
ఇప్పటికే అనేకమంది ఉన్నతాధికారుల పేరుతో అకౌంట్లను క్రియేట్ చేసి డబ్బులు కావాలని సందేశాలను పంపి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు పోలీసుల ఖాతాలను కూడా వదలడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు.

సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి
నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి తనకు డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపుతున్నారు. దీంతో ఒక స్నేహితుడు నిజమని నమ్మి 20వేల రూపాయలు పంపి మోసపోయినట్టు సమాచారం. ఇక విషయం తెలిసిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని పేర్కొన్నారు. తన పేరుతో డబ్బులు కావాలని ఎవరైనా ఎటువంటి మెసేజ్ పంపించినా, దానికి స్పందించవద్దని ఆయన సూచించారు.

అలాంటి వాటిని బ్లాక్ చేసి ఫిర్యాదు చెయ్యండి
తన పేరుతో ఉన్న నకిలీ ఖాతాలను తొలగిస్తున్నట్టు చెప్పారు. అనుమానాస్పదమైన లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తే ఆ నంబర్లను బ్లాక్ చేయాలని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. బ్లాక్ చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ మోసాల పైన తక్షణం స్పందించాలని 1930 హెల్ప్ లైన్ నెంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+