loksabha polls: తెలంగాణాలో కేసీఆర్ పని గోవిందా; ఆ పార్టీదే హవా.. షాకింగ్ సర్వే!!
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో లోకసభ ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ తో పాటు, బీఆర్ఎస్, బిజెపిలు ఈసారి లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి.
దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సంపాదించడం అవసరమని భావిస్తున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించి రాహుల్ గాంధీకి బహుమానంగా ఇవ్వాలని కంకణం కట్టుకుంది. మరోవైపు బి ఆర్ ఎస్ తన గత ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, అత్యధిక స్థానాలు సంపాదించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి? ఏ పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అన్న దానిపైన జోరుగానే సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాలలో సర్వే నిర్వహించింది.
ఈ 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారని మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నారని పేర్కొంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలలో ఉండబోతుందని వెల్లడించింది ఇక రెండవ స్థానంలో బిజెపి నిలుస్తుందని, ఆ పార్టీకి 30 సైతం ఓట్లు వస్తాయని సర్వే ఫలితాలలో తేలిందని పేర్కొంది.
ఇక పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితమవుతుందని, 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి ఈసారి 22 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు సంపాదించాలనుకుంటున్న బిజెపికి షాక్ ఇచ్చి, కెసిఆర్ పని గోవిందా అని తాజా సర్వే తేల్చింది.
కాంగ్రెస్ పార్టీకి పురుష ఓటర్లు 42 శాతం, మహిళా ఓటర్లు 50 శాతం అనుకూలంగా ఉన్నారని, బిజెపికి పురుష ఓటర్లు 34 శాతం, మహిళా ఓటర్లు 26 శాతం, బిఆర్ఎస్ పార్టీకి పురుష ఓటర్లు 21 శాతం, మహిళా ఓటర్లు 23 శాతం అనుకూలంగా ఉన్నారని తెలిసింది.
ఇక పీఎం ఎవరనే దానిపైన అభిప్రాయాన్ని తీసుకున్న సర్వేలో 51 శాతం తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. నరేంద్ర మోడీకి 38 శాతం మద్దతు ప్రకటించగా, కెసిఆర్ ప్రధాని కావాలని ఒక్క శాతం వరకు మాత్రమే కోరుకున్నారు. మరో 9 శాతం మంది ఎవరైనా ఓకే అంటూ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications