చంద్రబాబుకు భారీ షాక్: కారెక్కేందుకు రావుల బేరసారాలు?
హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు బేరసారాలు సాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రావుల చంద్రశేఖర రెడ్డి తెలంగాణలో టిడిపికి బలమైన గొంతునిస్తూ వస్తున్నారు. ఆయన కూడా పార్టీని వీడితే టిడిపిపై పెద్ద దెబ్బనే పడుతుంది. తనకు ఎమ్మెల్సీ లేదా ఇతరత్రా ఏ పదవులు అక్కర్లేదని కేవలం తనకు రాజ్యసభ సీటు ఇస్తే తెరాసలోకి వస్తానని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చెప్పినట్లు సమాచారం.
రావుల చంద్రశేఖర రెడ్డి టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విలువైన సలహాలు, సూచనలు ఇచ్చే మేధావిగాపేరు తెచ్చుకున్నారు. అంతేకాదు గతంలో రాజ్యసభకు ఎంపికైన రావుల చంద్రబాబుకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా వున్నారు. రాజ్యసభ కాలం ముగియడంతో రావుల 2004 సాధారణ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా వన పర్తి నుంచి ఓటమి చవిచూశారు.

2009లో విజయం సాధించి తన సత్తాను చాటుకున్నా రు. 2014 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఓటమిని చవిచూశారు. సాధారణ ఎన్నికల్లో తర్వా త తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారడంతో ఆ పార్టీలో వుండి లాభం లే దనే నిర్ణయానికి నేతలు వస్తున్నట్లు తెలుస్తోంది. రావుల చంద్రశేఖర రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
సీనియర్ నేత వున్న మోత్కుపల్లితో పాటు రావులకు గవర్నర్‌తో పాటు కేంద్ర స్థాయిలో ఏదో ఒక పదవి ఇప్పిస్తారని ఆశించారు. అవి అమలయ్యే సూచనలు కనిపించకపోవడంతో రావుల కారెక్కెందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇటీవలే తెరాసలో చేరిన టీటీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా రావులకు మంచి సహచరుడు. ఈ కారణంతో ఎర్రబెల్లి కూడా రావులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications