మాదాపూర్ 'సెక్స్' రాకెట్‌లో దిమ్మతిరిగే నిజాలు: 50సైట్లతో బిజినెస్.. ఇలా రొంపిలోకి?

సంజయ్ అనే వ్యక్తి ఈ దందాలో కీలక సూత్రధారి అని ముఠా సభ్యులైన రాజేశ్‌ పర్వాల్‌, ఆర్తీ పర్వాల్‌ తెలిపారు.

హైదరాబాద్‌: కోల్‌కతా కేంద్రంగా హైదరాబాద్ లోను విస్తరించిన వ్యభిచార దందాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మాదాపూర్‌లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి ఓ అంతర్రాష్ట వ్యభిచార నేపథ్యంలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిసినట్లు సమాచారం.

పోలీసుల దాడుల్లో వ్యభిచార ముఠా నిర్వాహకుల్లో ఒకరైన రాజేశ్ పర్వాల్, ఆర్తీ పర్వాల్ పట్టుబడగా.. వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ముఖ్యంగా సంజయ్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా వారు వెల్లడించినట్లు తెలుస్తోంది.

యువతులకు ఇలా వల వేస్తాడు:

యువతులకు ఇలా వల వేస్తాడు:

సంజయ్ అండ్ గ్యాంగ్ ఎక్కువగా టార్గెట్ చేసేది మోడల్స్‌నే. కొంతమంది అమాయక అమ్మాయిలు కూడా వీరి వలలో చిక్కుకున్నారు. తొలుత వారితో పరిచయం పెంచుకునే సంజయ్.. నెమ్మదిగా వారికీ లగ్జరీ లైఫ్ అలవాటు చేస్తాడు. పెద్ద పెద్ద నగరాల్లో జరిగే పార్టీలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరీ.. ఎంజాయ్ చేయాలంటూ పంపిస్తుంటాడు. ఆ తర్వాత డబ్బు ఆశచూపి వారిని వ్యభిచారంలోకి దింపుతాడు.

వెబ్ సైట్లతో దందా:

వెబ్ సైట్లతో దందా:

యువతులను మచ్చిక చేసుకున్న తర్వాత నెమ్మదిగా వారి వద్ద వ్యభిచారం చేయాలన్న ప్రతిపాదన తీసుకొస్తాడు. ఇందుకు గాను లక్షల్లో డబ్బు ఆఫర్ చేసి ప్రలోభ పెడుతాడు. వారానికి రూ.2లక్షలు ఇస్తానని చెబుతాడు. దీంతో డబ్బు ఆశకు చాలామంది యువతులు ఇతని వలలో చిక్కుకున్నారు.

ఒక్కసారి యువతులు కమిట్ అయితే.. వారి ఫోటోలను పలు వెబ్ సైట్స్ లో పోస్టు చేస్తాడు. దీనికోసం 50వెబ్ సైట్స్ ను అతను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వెబ్ సైట్స్ నిర్వాహకులంతా ఎప్పటికప్పుడు కొత్త అమ్మాయిల కోసం గాలం వేస్తూనే ఉంటారు.

అంతా ఆన్ లైన్, భారీ డబ్బు:

అంతా ఆన్ లైన్, భారీ డబ్బు:

కోల్ కతా కేంద్రంగా జరుగుతున్న ఈ దందాలో దేశంలోని పెద్ద నగరాల్లో చాలామంది నిర్వాహకులు ఉన్నారు. ఆన్ లైన్ ద్వారానే వీరంతా యువతులను బుక్ చేయడం, విటుల వద్దకు పంపించడం చేస్తుంటారని పోలీసులు నిర్దారించారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, టెలిగ్రామ్‌ల్లో ఇందుకోసం సంజయ్ ప్రత్యేకమైన గ్రూప్స్ క్రియేట్ చేశాడు. రోజుకు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు కస్టమర్ల నుంచి వసూలు చేయాలని ఆయా నగరాల్లోని నిర్వాహకులను ఆదేశించాడు.

అంతర్రాష్ట్ర ముఠాలో వీళ్లు పట్టుబడ్డారు:

అంతర్రాష్ట్ర ముఠాలో వీళ్లు పట్టుబడ్డారు:

ఇటీవల మాదాపూర్‌లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసిన సమయంలో ఈ అంతర్రాష్ట వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్యాభర్తలు రాజేశ్‌ పర్వాల్‌, ఆర్తీ పర్వాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. సంజయ్ పేరు వారు కీలకంగా వెల్లడించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో బెంగళూరు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం ఏడుగురు వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.

సినీ రంగానికి చెందిన యువతులు:

సినీ రంగానికి చెందిన యువతులు:

ఈవెంట్ మోడల్స్, డ్యాన్సర్స్, సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోలేని అమ్మాయిలు.. ఇలా చాలామంది సంజయ్ వలలో చిక్కుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంజయ్ అండ్ గ్యాంగ్ నిర్వహిస్తున్న వ్యభిచార దందాల్లో ఎక్కువగా ముంబై, కోల్‌కాతా, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన యువతులు ఉన్నట్లు తేలడం గమనార్హం.

ప్రస్తుతం సంజయ్ కోసం గాలిస్తున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠా అరెస్ట్‌ విషయం తెలియగానే సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+