ఛీ ఛీ.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ పాడు పని.. చూస్తేనే వాంతులు ఖాయం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల బాగోతాల గురించి ఎంత చెప్పిన తక్కువే. నిత్యం ప్రైవేట్ ట్రావెల్స్ దందా గురించి, టికెట్ రేట్ల గురించి, నిర్లక్ష్యపు సమాధానాలు, ప్యాసింజర్లను ఇబ్బందులకు గురి చేసే ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. ఇంతా జరుగుతున్న కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ముడుపులు అందితే చాలు అన్నట్టు ఏం పట్టించుకోకుండా ఉండే కొందరికి.. ఇప్పుడు చెప్పబోయే ఘటన తర్వాత అయిన మార్పు వస్తే మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పుడు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోని డ్రైవర్ గురించి చెప్పబోతున్నాం. ప్యాసింజర్లను ఎక్కించేకొని క్షేమంగా గమ్యానికి చేర్చడం ఆయన పని. మద్యం మత్తులో వాహనాన్ని నడిపేవారు, అతివేగంతో నడిపి ప్రమాదాలు చేసే వారిని చూసుంటాం. నిర్లక్ష్యంగా ఉంటూ ప్యాసింజర్లను ఇబ్బందులు పెట్టె వారిని కూడా చూసుంటాం. కానీ ఈ డ్రైవర్ చేసిన పని మాత్రం చూస్తే.. ఛీ ఛీ ఇదేం పాడు పని అనడం మాత్రం గ్యారంటీ. ఇందుకు సంబంధించిన వీడియోని చూసిన తర్వాత వాంతులు చేసుకోవడం పక్కా అనిపిస్తుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రయాణికుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ బస్సు ఎక్కాడు. సాధారణంగా లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ బస్సులో కూడా ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ ఇవ్వాల్సి ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో.. బస్సును ఆపిన డ్రైవర్.. పక్కనే ఉన్న బాటిల్ మూత తీసి అందులో నుంచి నీళ్లు తాగి.. అక్కడే ఉన్న మరో బాటిల్ మూత తీసి అందులో ఉమ్మేశాడు.
ప్రైవేట్ బస్సు నిర్వాహకం
— ChotaNews App (@ChotaNewsApp) February 23, 2025
ఓ ప్రయాణికుడు హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ బస్ ఎక్కగా అతడికి చేదు అనుభవం ఎదురైంది. అందులోని డ్రైవర్ ఒక్కో బాటిల్ మూత తీసి వాటర్ నోటిలోకి సగం తీసుకోని వేరే వాటర్ బాటిల్లో నోటిలోని నీటితో నింపుతున్నాడు. ఓ ప్రయాణికుడు గమనించి… pic.twitter.com/IxMbuWxT4U
అయితే ఈ తతంగాన్ని మొత్తం గమనించిన ప్రయాణికుడు.. డ్రైవర్‌కు తెలియకుండా అద్దంలో నుంచి వీడియో తీశాడు. ఇదేంటని డ్రైవర్‌ను ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంబంధిత డ్రైవర్ పై యాక్షన్ తీసుకోవాలని.. అందరూ డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications