ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. యువకుడి తలపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్ లోని బాలానగర్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వాహనదారుడు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో బైకును ఆపే క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడ్డాడు. వెంటనే అతడి తలపైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో వాహనదారులు, మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. అంబులెన్స్ లో మృతదేహంతో సహా కుటుంబసభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై భైఠాయించి, ఆందోళన చేశారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా రాకపోకలు స్తంభించాయి. వాహనదారుల ఆందోళనలతో మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2025
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. వాహనదారుడు మృతి
న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ - బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి
చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన… pic.twitter.com/diHZc2vJA7
ఈ క్రమంలో పోలీసులు.. మృతుడి కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు నిరసనను కొనసాగించారు. దీంతో పోలీసులు కుటుంబసభ్యులపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అంబులెన్స్ ను పంపించిన పోలీసులు.. ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications