• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చాందిని కేసులో షాకింగ్ విషయాలు, 52 మంది విద్యార్థులు, 23 గదుల్లో.. మూడ్రోజులు.. జల్సా!

  By Ramesh Babu
  |
   Chandini Jain Case : shocking news revealed షాకింగ్ విషయాలు గదుల్లో మూడ్రోజులు జల్సా!| Oneindia

   హైదరాబాద్: చాందిని హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు మరికొన్ని విభ్రాంతికర విషయాలు తెలిశాయి. తల్లితండ్రులను పక్కదోవ పట్టించి మైనర్లు అయిన దాదాపు 52 మంది విద్యార్ధినీ విద్యార్ధులు మూడు రోజులు హైదరాబాద్ నడిబొడ్డులోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో విడిది చేశారు.

   అక్కడ విచ్చలవిడిగా ఆడమగా కలిసి గదుల్లో ఉన్నారు. మైనర్లకు హోటల్ యజమాన్యం లిక్కర్ సరఫరా చేసింది. అలా సెంట్రల్ కోర్టు హోటల్‌లో మూడు రోజులు జల్సా చేసిన వారిలో చాందిని కూడా ఒకరు.

   చాందిని ఒక్కతే కాదు మిగతా విద్యార్ధులంతా అంతర్జాతీయ ప్రమాణాలున్న పాఠశాలల్లో చదువుతున్న వారే. ఆ విద్యార్ధులు ఏ విధంగా గాడితప్పుతున్నారు. తల్లితండ్రుల పర్యవేక్షణాలోపం విద్యార్ధులను పతనం అంచుకు ఏ విధంగా తీసుకెళ్తుందనడానికి చాందినీ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందంటున్నారు పోలీసు అధికారులు.

   52 మంది ఫేస్‌బుక్‌ స్నేహితులే...

   52 మంది ఫేస్‌బుక్‌ స్నేహితులే...

   ఫేస్‌బుక్‌లో స్నేహితులైన దాదాపు 52మంది విద్యార్ధులు నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ అనే పేజీ ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులంతా ఇందులో సభ్యులు. వీరంతా కలిసి ఈనెల ఒకటవ తేదీ నుంచి మూడో తేదీ వరకు లకడీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో మీట్ అయ్యారు.

   మూడు రోజులు హోటల్ గదిలో విచ్చలవిడిగా...

   మూడు రోజులు హోటల్ గదిలో విచ్చలవిడిగా...

   మొత్తం 52 మంది విద్యార్ధిని, విద్యార్ధులు లక్డీకాపూల్ లోని ది సెంట్రల్ కోర్టు హోటల్లో 23 గదులు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత సమిట్ సంగతి దేవుడెరుగు.. అంతా అక్కడి పబ్‌లో బార్‌లో మజా చేశారు. ఇలా మూడు రోజులు విచ్చలవిడిగా గడిపారు. వీరిలో అత్యధికులు మైనర్లు. ఇక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఇళ్లల్లో అబద్దాలు చెప్పే వచ్చారు.

   కొత్త పరిచయాలు.. అనర్థాలకు దారులు..

   కొత్త పరిచయాలు.. అనర్థాలకు దారులు..

   ఇలా సమిట్‌లో చాందినికి పరిచయం అయ్యాడు సోహెల్ అనే విద్యార్ధి. అతనితో కేవలం మూడు రోజుల పరిచయమే చాందినికి. అతనితో ఆమె క్లోజ్ గా మూవ్ అయ్యిందని సాయికిరణ్ అనుమానించాడు. ఇదే చాందినీ హత్యకు మరో కారణమై ఉండవచ్చంటున్నారు అంతర్గత సంభాషణల్లో పోలీసు అధికారులు. చాందినిని హత్య చేసిన సాయి కిరణ్ కూడా మైనరే. అతను హైదరాబాద్ శివార్లలోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. చాందిని ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సీనియర్ ఇంటర్ విద్యార్ధిని.

   డ్రగ్ప్ నేపథ్యంలో హెచ్చరికలు చేసినా కూడా...

   డ్రగ్ప్ నేపథ్యంలో హెచ్చరికలు చేసినా కూడా...

   ఇటీవలే హైదరాబాద్‌ను వణికించిన డ్రగ్స్ కేసులో డ్రగ్ స్మగ్లర్ కెల్విన్ ముఠా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ధులను టార్గెట్ చేసింది. ఆ సమయంలో.. మీ విద్యార్ధుల కదలికలు గమనిస్తూ ఉండండి అంటూ.. పోలీసు అధికారులు పాఠశాలలకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. కానీ, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

   తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్లు?

   తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్లు?

   ఇద్దరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యారుల మధ్య చిగురించిన ప్రేమకథ చివరకు విషాదాంతమైంది. కారణాలేమైనా చాందిని హత్య జరిగితే.. ఆమెను చంపిన సాయి కిరణ్ జైలు గోడల మధ్య బతకాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫోకస్ పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   While doing enquiry by the police in Chandini Murder Case.. some more shocking news revealed. Total 52 students of Hyderabad and Bangalore International School Students taken 23 rooms in Hotel Central Park, Lakdikapool and enjoyed with drinks, pubs, from September 1 - 3. These students are facebook friends. They created a separate page in facebook with the name of National Diplomatic Summit. Parents didn't know about their trip.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more