రేవంత్ రెడ్డికి షాక్: టీఆర్ఎస్‌లో చేరుతున్న కోడంగల్ టీడీపీ నేతలు
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం కోడంగల్‌లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి కేడర్ అంతా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తె
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం కోడంగల్‌లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి కేడర్ అంతా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నియోజకవర్గంలోని టీడీపీ, రేవంత్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సమూహికంగా ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు, నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాగా, పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సొంత నియోజవర్గంలోని కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం గమనార్హం.

టీఆర్ఎస్ నేత గురునాథరెడ్డిని ఇప్పటికే పలువురు రేవంత్ వర్గం నేతలు కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రేవంత్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే, ముందస్తుగానే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఎంపీ జితేందర్ రెడ్డితో చర్చించి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చేందుకు సిద్ధమవుతున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications