• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కూతురిపై తండ్రి రేప్: బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి ఇలా...

By Narsimha
|

హైదరాబాద్:మహిళలు, యువతులతో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడులు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతి రోజూ ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా పాలకులు కఠినంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్నా దేశంలో ఏదో ఒక చోట ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. హైద్రాబాద్‌లో మైనర్ బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అయితే ఈ విషయమై రాజీ కుదుర్చుకొనేందుకు ప్రయత్నాలు చేశాడు.ఎట్టకేలకు ఈ విషయం తెలిసిన భార్య భర్తపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైద్రాబాద్ లో 13 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తొలుత మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్టు భార్యను నమ్మించి క్షమాపణలు కోరిన భర్త, ఆ తర్వాత కూడ సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తనను విడిచిపెట్టాలని ఆ బాలిక ఎంతగా అరిచినా కానీ ఆ నిందితుడు మాత్రం ఆ బాలికను మాత్రం వదల్లేదు. తన పశువాంఛను తీర్చుకొన్నాడు. అంతేకాదు పోలీసు కేసు పెట్టకుండా ఉండాలని నిందితుడు రాజీ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే ఎట్టకేలకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

సవతి తండ్రి అత్యాచారం

సవతి తండ్రి అత్యాచారం

హైద్రాబాద్‌లో నివాసం ఉండే ఓ వివాహితకు భర్త చనిపోయాడు. భర్త చనిపోయేనాటికి ఆమెకు కూతురు ఉంది. ఆ కూతురు వయస్సు ప్రస్తుతం 13 ఏళ్ళు. అయితే 8 ఏళ్ళ క్రితం ఆ వివాహిత మరో వ్యక్తిని వివాహం చేసుకొంది. ప్రస్తుతం అతడితో కలిసి ఆమె నివసిస్తోంది. వివాహిత కూతురు కూడ వారితో పాటే ఉంటుంది. అయితే భార్య పనికి వెళ్ళిన సమయంలో ఇంటికి వచ్చిన సవతి తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

 మద్యం మత్తులో రేప్

మద్యం మత్తులో రేప్

ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తల్లి పనికి వెళ్ళే సమయంలో భయంతో కూతురు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఈ విషయమై భర్తను నిలదీసింది భార్య. అయితే ఈ విషయమై తాను తప్పు చేశానని భర్త భార్యను కోరాడు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో మరో తప్పు చేయబోనని ఆమెకు తేల్చి చెప్పాడు.

డోర్లు పగులగొట్టి రేప్

డోర్లు పగులగొట్టి రేప్

ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత భార్య పనికి వెళ్ళింది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. భయంతో కూతురు బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపులు వేసుకొంది. బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి మైనర్ బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతేకాదు బెల్ట్‌తో కొట్టి తీవ్రంగా హింసించాడు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

పని నుండి ఇంటికి వచ్చిన తల్లికి కూతురు అసలు విషయాన్ని తేల్చి చెప్పింది. కూతురిని తీసుకొని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు నమోదు చేయాలని కోరుతూ బాధితురాలు తల్లితో కలిసి మూడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించింది.పోలీసులు కూడ ఈ కేసు విషయమై అంతగా శ్రద్ద చూపలేదు. ఈ ఘటన తర్వాత నిందితుడు పారిపోయాడు. అంతేకాదు బాధితురాలి చదువు సహయం చేస్తానని, బ్యాంకులో డబ్బులను డిపాజిట్ చేయిస్తామని రాజీ కోసం ప్రయత్నాలను ప్రారంభించాడు. అయితే తాను ఆ ఇంటికి వెళ్ళనని బాధితురాలు చెప్పారు. హస్టల్‌లో ఉంటూ తాను విద్యాభ్యాసం చేస్తానని ఆమె చెప్పారు. న్యాయం చేయలని బాధితురాలు కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

English summary
In another bone-chilling incident, a stepfather sexually assaulted his 13-year-old daughter who called her 'daddy'. The class 8 girl was assaulted in the absence of her mother, who work in a retailer shop. This alleged act has been reported in Hyderabad

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more