నయీం షాక్: 2నెలల్లో 200 కోట్లు, అమ్మాయిలకి షార్ప్ షూటింగ్, తెరపైకి శ్రీధర్

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్‌కౌంటర్లో హతమైన నయీం గురించి పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరో రెండు నెలల్లో రూ.200 కోట్లు వసూలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలనుకున్నాడని తేలింది.

అలాగే, తక్కువ వయసున్న అమ్మాయిలను కొనుగోలు చేసి వారిని లైంగిక కార్యకలాపాలకు వినియోగించుకొని, తిరిగి ముఠాలకు అమ్మేసేవాడని తేలింది. అమ్మాయిలకు షార్ప్ షూటింగులో శిక్షణ ఇప్పించడంతో పాటు వారిని తన డెన్ నిర్వహణ బాధ్యతలకు వినియోగించుకునేవాడు.

పోలీసులు నయీం కుటుంబ సభ్యులను ఇతరులను విచారిస్తున్నారు. ఈ విచారణలో వారు పలు అంశాలు వెల్లడిస్తున్నారు.

Shocking things revealing in Nayeem case

రెండు నెలల్లో రెండు వందల కోట్ల రూపాయలు టార్గెట్‌గా పెట్టుకున్న నయీం.. పారిశ్రామికవేత్తలను, ప్రజాప్రతినిధులను, వ్యాపారులను బెదిరించి, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాలనుకున్నాడు. తన టార్గెట్ కోసం బెట్టింగులను కూడా ఎంచుకున్నాడు.

నార్సింగులోని ఇంటిలో దొరికిన డాక్యుమెంట్లు 137. అందులోని ఆస్తుల విలువ రూ.1680 కోట్లుగా తేలిందని సమాచారం. నయీం అత్త దగ్గర 430 డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించారు. నయీం పలువురు ప్రముఖులను బెదిరించి వారికి చెందిన భూములను పెద్ద మొత్తంలో లాక్కున్నాడు. చత్తీస్ గఢ్, ఒడిశాలోను అతను భారీగా ఆస్తులు కూడబెట్టాడు.

అమ్మాయిలను తీసుకొచ్చి..

నల్గొండ జిల్లాలోని మారుముల గ్రామాల్లో నుంచి అమ్మాయిలను కొని తీసుకు వచ్చేవాడు. తక్కువ వయసున్న అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకునే వాడు. తద్వారా అమ్మాయిల రవాణాలోను అతను కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అంతేకాదు, తన రక్షణ కోసం కూడా అమ్మాయిలను వాడుకునేవాడు.

తాను ఎక్కడకు వెళ్లిన మహిళలు, పిల్లలతో వెళ్లేవాడు. తద్వారా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నట్లుగా అందరూ భావించేలా చేసేవాడు. మారమూల గ్రామాల్లో నుంచి తీసుకు వచ్చిన అమ్మాయిలు లైంగికంగా వాడుకున్న అనంతరం ముఠాలకు అమ్మేసేవాడని తెలుస్తోంది.

Shocking things revealing in Nayeem case

అమ్మాయిలకు షార్ప్ షూటింగులో శిక్షణ

నయీం అమ్మాయిలకు షార్ప్ షూటింగులో శిక్షణ ఇప్పించేవాడు. అలాంటి వారికి తన డెన్‌లో నిర్వహణ బాధ్యతలు అప్పగించేవాడు. డెన్ బాధ్యతను మహిళలకే అప్పగించేవాడు.

తెరపైకి శ్రీధర్ గౌడ్

నయీం కేసులో కొత్తగా తెరపైకి శ్రీధర్ గౌడ్ పేరు వచ్చింది. శ్రీధర్ గౌడ్ నివాసం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. నయీం సెటిల్మెంట్ల కోసం శ్రీధర్ గౌడ్ ఇంటిని ఎంచుకునే వాడని తేలింది. శ్రీధర్ గౌడ్.. నయీం కుడిభుజంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+