హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్ట్రీట్ చిల్డ్రన్ మధ్య నటి శ్రీరెడ్డి జన్మదిన వేడుకలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నటి, ప్రముఖ యాంకర్ శ్రీరెడ్డి తన జన్మదిన వేడుకలను సామాజిక సేవాదృష్టితో జరుపుకున్నారు. హైదరాబాదులోని నాంపల్లిలో వీధి బాలల కోసం ఏర్పాటు చేసిన డాన్ బోస్కో నవజీవన్ హోంలో తన జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు.

తన జన్మదినం సందర్భంగా ఆమె పిల్లలకు బహుమతులు పంచిపెట్టారు. వారి మద్య కేక్ కట్ చేశారు. తమ ఆశ్రమానికి ప్రముఖ యాంకర్, నటి శ్రీరెడ్డి రావడం పట్ల డాన్ బోస్కో నవజీవన్ హోం పిల్లలు కేరింతలు కొట్టారు. ఆనందంగా బహుమతులు అందుకుని వారు శ్రీరెడ్డితో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

పిల్లల మధ్య గడపడం వల్ల తనకు ఆశీస్సులు అందాయని శ్రీరెడ్డి అన్నారు. ఇందులోని చాలా మంది పిల్లలు అనాథలని, వారి ఆశీస్సులు తనకు అందినట్లు అనిపించిందని ఆమె అన్నారు. పిల్లల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

పిల్లలతో శ్రీరెడ్డి

పిల్లలతో శ్రీరెడ్డి

నటి, ప్రముఖ యాంకర్ శ్రీరెడ్డి తన జన్మదిన వేడుకలను వీధి బాలల కోసం ఏర్పాటు చేసిన హోంలో జరుపుకున్నారు.

బిల్లలకు బహుమతులు

బిల్లలకు బహుమతులు

తన జన్మదినం సందర్భంగా ప్రముఖ యాంకర్, నటి శ్రీరెడ్డి డాన్ బోస్కో నవజీవన్ హోం పిల్లలకు బహుమతులు అందించారు.

పిల్లల మధ్య శ్రీరెడ్డి

పిల్లల మధ్య శ్రీరెడ్డి

వీధి బాలల కోసం నడుపుతున్న హోంలో నటి, ప్రముఖ యాంకర్ శ్రీరెడ్డి తన జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

పిల్లల్లో ఆనందం...

పిల్లల్లో ఆనందం...

శ్రీరెడ్డి తమ వద్దకు వచ్చి తమకు బహుమతులు అందజేయడం, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పిల్లలు ఆనందించారు.

ఇలా తినిపించారు...

ఇలా తినిపించారు...

డాన్ బోస్కో నవజీవన్ హోంలో శ్రీరెడ్డి తన జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. పిల్లలు ఆమెకు కేక్ తినిపించారు.

కేక్ తినిపిస్తూ....

కేక్ తినిపిస్తూ....

పిల్లలకు శ్రీరెడ్డి కేక్ తినిపించగా, పిల్లలు ఆమెకు కేక్ తినిపించారు. పిల్లలతో శ్రీరెడ్డి ఉల్లాసంగా గడిపారు.

పిల్లల ఆశీస్సులు..

పిల్లల ఆశీస్సులు..

జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన ప్రముఖ యాంకర్, నటి శ్రీరెడ్డిని వీధి బాలలు ఆశీర్వదించారు. వారి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని శ్రీరెడ్డి అన్నారు.

హ్యాపీ బర్త్ డే టూ యూ...

హ్యాపీ బర్త్ డే టూ యూ...

ప్రముఖ యాంకర్, నటి శ్రీరెడ్డి కేక్ కట్ చేస్తున్నప్పుడు పిల్లలు హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ ఇలా చెప్పారు.

English summary
Actress & Famous Anchor Shree Reddy Celebrated Her Birthday with Children's of Don Bosco Navjeevan-Home for Street Childrens in Nampally, Hyderabad. She Distributed Gifts to Childrens and did the Cake Cutting amongst Childrens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X