పూరీ క్లోజ్ ఫ్రెండ్ శ్యామ్ కె నాయుడు విచారణ, క్లూస్ ఇచ్చిన జగన్నాథ్
డ్రగ్ కేసులో గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం ఆయన ఎక్సైజ్ ఆఫీస్‌కు బయలుదేరారు.
హైదరాబాద్: డ్రగ్ కేసులో గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం ఆయన ఎక్సైజ్ ఆఫీస్‌కు బయలుదేరారు.

వ్యూహం మార్చిన అధికారులు
తొలుత ఈ రోజు (జూలై 20వ తేదీ) నటి చార్మీని విచారించాల్సి ఉంది. శ్యామ్ కె నాయుడును ఈ నెల 23న విచారించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శ్యామ్ కె నాయుడును అధికారులు ఈ రోజు పిలిచారు. చార్మీని ఏ తేదీన విచారిస్తారో తెలియాల్సి ఉంది.

పూరీకి అత్యంత సన్నిహితుడు
శ్యామ్ కె నాయుడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అత్యంత సన్నిహితుడు. డ్రగ్ సప్లయర్ కెల్విన్ మొబైల్‌లో శ్యామ్ కె నాయుడు మొబైల్ నంబర్‌ను సిట్ అధికారులు గుర్తించారు.
Recommended Video


ముగ్గురి వద్ద ఫోన్ నెంబర్లు
ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల సెల్ ఫోన్లలో శ్యామ్ కె నాయుడు పేరును అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ముగ్గురి వద్ద ఆయన నెంబర్లు ఎందుకున్నాయో అధికారులు కూపీ లాగనున్నారు.

క్లూస్ ఇచ్చిన పూరీ జగన్నాథ్
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణకు సహకరించారని సిట్ అధికారి శీలం శ్రీనివాస్ బుధవారం తెలిపారు. విచారణలో ఆయన కొన్ని క్లూస్ ఇచ్చారన్నారు. విచారణలో మరిన్ని ఆధారాలు దొరికాయని చెప్పారు. పూరీ అనుమతితో రక్త నమూనాలు సేకరించామని, శాంపిల్స్ వచ్చిన తర్వాత మాట్లాడుతామని చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications