సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను కాల్చి చంపి, ఎస్సై ఆత్మహత్య: అధికారుల వేధింపులా, కొడుకు పెళ్లా?

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం జరిగింది. ఎస్సై చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం జరిగింది. ఎస్సై చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనలో భార్య అక్కడికి అక్కడే మృతి చెందింది. భార్యను కాల్చి చంపాక, అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. తొలుత అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

<strong>ఆ ఎస్సై కడప జిల్లా వాసి: ఇటీవలే సస్పెండ్ చేసినా.., 2004లోనూ</strong>ఆ ఎస్సై కడప జిల్లా వాసి: ఇటీవలే సస్పెండ్ చేసినా.., 2004లోనూ

SI kills wife with revolver and tries to commit suicide

దుబ్బాకలో పని చేస్తున్న చిట్టిబాబును డిప్యూటేషన్ మీద సిద్దిపేటకు పంపించారు. అతను భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా? లేక కుటుంబ సమస్యలా అనేది తేలాల్సి ఉంది. భార్యను చంపేసి, అతను ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ సమస్యలు ఉన్నాయా అనే కోణంపై చర్చ జరుగుతోంది.

SI kills wife with revolver and tries to commit suicide

ఎస్సై చిట్టిబాబుకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. స్వస్థలం కడప జిల్లా. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేయనున్నారు.

ఎన్నో ప్రశ్నలు

ఉన్నతాధికారుల వేధింపుల వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం అతను అవినీతి ఆరోపణల పైన సస్పెండ్ అయ్యారు. మరోవైపు, తన కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ఎస్సై చిట్టిబాబు ఆగ్రహంతో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కుటుంబ సమస్యలు, అటు బాధ్యతల విషయంలో అసహనానికి లోనై... భార్యను చంపి, ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు.

English summary
SI killed wife with service revolver and tried to commit suicide in Siddipet district on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X