Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ స్టైల్‌ను శిఖర్ ధావన్ కాపీ కొట్టాడా?

హైదరాబాద్: హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టయిల్‌ను కాపీ కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మీడియా సంస్థ ఇందుకు సంబంధించి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అందుకు సాక్ష్యంగా శిఖర్ ధావన్ ఫొటోను కూడా జత చేసింది.

పవన్ కళ్యాణ్ స్టైల్‌ అంటే అందరికి గుర్తుకొచ్చేది తన చేతిని మెడ వెనుక వైపు పెట్టుకోవడమనేది. ఈ స్టైల్‌ని కొందరు యువ హీరోలు తమ సినిమాలలో వాడుతూ పవన్ కల్యాణ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా పవన్ స్టైల్ ని కాపీ కొట్టాడా .. అంటే పై ఫోటోని చూస్తే అలానే అనిపిస్తుందని ఆ మీడియా సంస్థ రాసింది.

Sikhar Dhawan copies Pawan Kalyan style

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్న శిఖర్ అండ్ టీమ్ సభ్యులు తాజాగా అపోలో హాస్పిటల్‌ని సందర్శించారు.ఆ సమయంలో ధావన్ సరదాగా తన చేతిని మెడ వెనుక పెట్టుకున్నారు. వెంటనే ఆ సన్నివేశాన్ని ఫొటో గ్రాఫర్ తన కెమేరాలో బంధించారు.

అయితే ఇది అనుకోకుండా జరిగిందే అయినా పవన్ అభిమానులు మాత్రం తమ హీరో స్టైల్‌ని క్రికేటర్స్ కూడా ఫాలో అవుతున్నారంటూ సరదాగా ముచ్చటించుకుంటున్నారని ఆ వార్తాకథనం సారాంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+