వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘టి హబ్‌’: సిలికాన్ వ్యాలీలో కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన ఎనిమిదోరోజు ప్రతిష్ఠాత్మక సిలికాన్ వ్యాలీలో కొనసాగింది. పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని సాప్ (ఎస్‌ఏపీ) ప్రాంగణంలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు.

ప్రముఖ కంపెనీలు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో మంత్రి టీ హబ్ స్వరూప స్వభావాలను వివరించారు. పరిశోధనలకు ప్రోత్సాహమిచ్చేలా చేపడుతున్న టి-హబ్ వంటి వ్యవస్థ దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేదని మంత్రి తెలిపారు. భారీ ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమంతో తెలంగాణ దేశ ఐటీ రంగంలో విశిష్టస్థానం సంతరించుకుందని చెప్పారు.

టీ హబ్ కార్యక్రమం వల్ల హైదరాబాద్‌లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఐటీరంగంలో అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. టీ హబ్‌పై మరిన్ని వివరాలు వాకబు చేసిన వివిధ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలు ఈకార్యక్రమాన్ని అభినందించారు. టి హబ్ ద్వారా వచ్చే స్టార్టప్ కంపెనీలకు సిలికాన్ వ్యాలీలో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని సైతం చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్ అట్లో నగర మేయర్ కరెన్ హోల్మన్, నాస్కామ్ తరఫున వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రవి గుర్రాలతోపాటు సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులు నిశిత్ దేశాయ్, మోహన్ ఉత్తర్వర్, పీకే గులాటీ, రాజురెడ్డి, సునీల్ ఎర్రబెల్లి, మాలవల్లి కుమార్, మైక్రోసాఫ్ట్ వెంచర్‌కు చెందిన రవినారాయణ్, బ్లూమ్ వెంచర్ తరఫున కార్తీక్ రెడ్డి, సంజయ్‌నాథన్‌లు హాజరయ్యారు.

ఆ తర్వాత కావియమ్ సీఈవో సయిద్ అలీతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటీలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తర్వాత ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డెబోరా సీ షోకిస్టు , డ్విట్ డైరెక్స్‌లతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల కోసం చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రభుత్వం అందించే సహకారాన్ని వివరించారు.

కెటిఆర్

కెటిఆర్

రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన ఎనిమిదోరోజు ప్రతిష్ఠాత్మక సిలికాన్ వ్యాలీలో కొనసాగింది.

కెటిఆర్

కెటిఆర్

పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.

కెటిఆర్

కెటిఆర్

కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని సాప్ (ఎస్‌ఏపీ) ప్రాంగణంలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రముఖ కంపెనీలు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో మంత్రి టీ హబ్ స్వరూప స్వభావాలను వివరించారు.

English summary
Telangana State IT Minister KT Rama Rao was the key note speaker at the NASSCOM’s Innotrek event that took place at SAP campus in Palo Alto, CA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X