సినారె గజల్ గీతాంజలి: ఈరోజు సాయంత్రం రవీంద్రభారతిలో..
సినారె గజల్ గీతాంజలి' పేరిట సాగే ఈ కార్యక్రమం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనుంది.
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో ఎనలేని ఖ్యాతిని గడించి ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారెను స్మరించుకోవడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 'సినారె గజల్ గీతాంజలి' పేరిట సాగే ఈ కార్యక్రమం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనుంది.
శుక్రవారం సాయంత్రం 6గం.కు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు నందన్ రాజ్ నిర్వహించనున్నట్లు హరికృష్ణ తెలిపారు.రవీంద్రభారతి మెయిన్ హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలాహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి, సి.ఎం. ఓ.ఎస్. డి. శ్రీ దేశపతి శ్రీనివాస్ పాల్గొననున్నారు.

కాగా, ఇటీవల నందన్ రాజ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన 'రేలారే.. రేలారే..' పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ నేల గొప్పదనాన్ని వివరిస్తూ సాగే ఈ పాట.. తక్కువ కాలంలోనే దాదాపు 16లక్షల హిట్స్‌ను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని బెస్ట్ మ్యూజికల్ హిట్స్ వచ్చే అవకాశం ఉంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications