తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం!

తెలంగాణ రాష్ట్ర డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్ ఇచ్చింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ విద్యుత్ కంపెనీ సంస్థలకు కాకుండా రాజస్థాన్ కు విద్యుత్ విక్రయించాలని నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ విద్యుత్తును రాజస్థాన్ కు విక్రయించాలని సింగరేణి నిర్ణయం తీసుకోవడం నిజంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు షాక్ అని చెప్పాలి.

సింగరేణికి డిస్కం ల బకాయిలు

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన సింగరేణి ఈ చర్యకు పాల్పడడం షాకింగ్ గా అనిపించినప్పటికీ అందుకు ప్రధాన కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నుండి సరఫరా అయిన విద్యుత్ కు సంబంధించి తెలంగాణ డిస్కం లు సింగరేణి సంస్థకు దాదాపు 27, 379 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉంది. ఈ భారీ ఆర్థిక లోటు కారణంగా సంస్థ మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఏర్పడింది.

Singareni shock for telangana discoms decided to sell power from upcoming 800 MW plant to Rajasthan

కొత్త ప్లాంట్ కు సంబంధించి విద్యుత్ రాజస్థాన్ కు విక్రయం

ఈ క్రమంలో భారీగా బకాయిలు ఉన్న డిస్కమ్ లకు కాకుండా, సక్రమంగా చెల్లింపులు చేసే ఇతర రాష్ట్రాలకు, లేదా ఓపెన్ మార్కెట్లో కొత్త ప్లాంట్ కు సంబంధించి విద్యుత్ విక్రయించాలని సింగరేణి భావిస్తోంది. ఈ క్రమంలోనే సింగరేణి రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సింగరేణి ప్లాన్ ఇదే

సింగరేణి కొత్త ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ రాజస్థాన్ కి సరఫరా చేసి, దానికి బదులుగా అక్కడ 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్ ను వినియోగించుకోవాలనే ప్రతిపాదన కూడా ప్రస్తుతం పరిశీలిస్తోంది. అయితే సింగరేణి తీసుకునే ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి జెన్కోకు అనుమతి

తెలంగాణ రాష్ట్రానికి అదనపు థర్మల్ విద్యుత్ ఆవశ్యకత ఉందని ప్రభుత్వం గుర్తించి ఈ క్రమంలో ఇటీవల రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి జెన్కోకు అనుమతి ఇచ్చింది. ప్లాంట్ పక్కనే కొత్త యూనిట్ నిర్మాణం చేస్తే, భూసేకరణ భారం లేకుండా మెగా వాట్ కు 12 కోట్ల రూపాయల ఖర్చు తోనే నిర్మాణం పూర్తయ్యేది. అది జరగలేదు.

తెలంగాణా విద్యుత్ అవసరాలకు ప్లాంట్.. ఆర్ధిక భారం

ఈ కరెంటును కాస్త రాజస్థాన్ రాష్ట్రానికి విక్రయిస్తే, తెలంగాణ కోసం మరోచోట ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తుంది. ఇది రాష్ట్ర ఖజానా పైన కూడా అదనపు ఆర్థిక భారాన్ని చేస్తుంది. ఇదే సమయంలో పర్యావరణ నిబంధనలు కూడా కఠిన తరంగా మారుతున్న క్రమంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కొత్త అనుమతులను పొందడం కూడా కష్టంగా మారుతుంది.

సింగరేణి నిర్ణయంపై రాజకీయ దుమారం

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం చేతిలో ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోతే, భవిష్యత్తులో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విద్యుత్తు లభ్యత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి టెండర్ ప్రక్రియను వేగవంతం చేస్తూ కన్సల్టెన్సీ సంస్థల కోసం ప్రకటన జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో బకాయిల సమస్యను పరిష్కరించుకుని, ఈ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ను రాష్ట్ర అవసరాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+