నెలరోజుల క్రితమే మేజరైన సింగర్ మధుప్రియ: శ్రీకాంత్ ప్రేమలో ఎలా పడిందంటే?
హైదరాబాద్: ఆడపిల్లనమ్మా అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన సింగర్ మధుప్రియ ప్రేమ వ్వవహారం వివాదాస్పదంగా మారింది. నెల రోజుల క్రితమే 18 సంవత్సరాలు నిండిన సింగర్ మధుప్రియ తాను మేజర్‌నని, తన పెళ్లిని ఇష్టమైన వాడితో చేసుకోవచ్చని పోలీసుల ఎదుట వాదిస్తోంది.
అయితే తమ కూతురు ఇంకా చిన్నపిల్లేనని, ఇంత చిన్న వయసులో పెళ్లేంటని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. మధుప్రియ భవిష్యత్ దెబ్బతేసేందుకు ఎవరో పన్నిన పన్నాగం అని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టాలపై వీరిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ, తాను మేజర్ అయిన తరువాత మాత్రమే విషయం బయటపెట్టాలని ముందే మధుప్రియ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి నల్లకుంట వాసులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. శ్రీకాంత్ నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్నాడని కొందరు చెబుతుంటే, లేదు... అతను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి మాత్రమేనని ఇంకొందరు అంటున్నారు.
హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో మధుప్రియ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే శ్రీకాంత్ కూడా ఉండేవాడని, అప్పుడే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ కొన్ని షార్ట్ ఫిలింలను తీశాడని తెలుస్తోంది. వీటిల్లో కొన్నింటిలో మధుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిందని తెలుస్తోంది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టినట్టు సమాచారం.
సింగర్ మధుప్రియ ఇంటర్ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధు ప్రియ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తల్లిదండ్రులు పెద్దింటి మల్లేశ్, సుజాత. తల్లితండ్రులకు ముగ్గురు ఆడసంతానం. అందులో రెండవ అమ్మాయి మధుప్రియ.
గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకుంది. పెద్దింటి మధుప్రియ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 26 ఆగస్టు 1997న పుట్టింది.
గత ఐదు రోజులుగా కాగజ్‌నగర్‌లోనే మధుప్రియ ఉంటోంది. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు కాగజ్‌నగర్ వాసవీ గార్జెన్‌లో ఆమె వివాహం జరగనుంది. అయితే పోలీసుల కౌన్సిలింగ్ నేపథ్యంలో మధుప్రియ వివాహం జరగుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications