వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కూతురు ఇటు రావడంలేదేమో: సింగర్ సునీత కామెంట్, ఫేస్ బుక్ లో వైరల్..

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్’పై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

సునీత ఇలా షాకిచ్చిందేంటీ ?

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్'పై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

తాజాగా ప్రముఖ గాయని సునీత కూడా ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్ట్ చేశారు. ''ట్రంప్‌ కూతురు ఇవాంక రాయదుర్గం- ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో? వస్తే బావుండు'' అంటూ సునీత పెట్టిన పోస్టింగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Singer Sunitha Comments on Ivanka Trump's Visit

హైదరాబాద్‌లో ఇవాంక పర్యటించే ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఐటీ కారిడార్‌, పాతబస్తీలోని రోడ్లన్నీ తళతళలాడుతూ, ఇరువైపులా పెయింటింగ్‌లు, పచ్చదనంతో ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.

ఈ అభివృద్ధి పనులు, సొబగులు అన్నీ ఇవాంక ప్రయాణించే మార్గాలకే పరిమితమా? అన్నట్టుగా సునీత చేసిన కామెంట్‌పై నెటిజెన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే సింగర్ సునీత సమస్యల మీద గొంతెత్తడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
US President Donald Trump's daughter Ivanka Trump would visit to Hyderabad next week and it will not be just a trip to for her to business conclave but also to explore the historic city of pearls. The Telangana Govt Officials have strengthened the security ahead of her Visit. In this regard, Tollywood Singer Sunitha has responded over the arrangements being made. she said that, " It would be better if Trump's Daughter travels from Rayadurgam to Khaja guda road".Many fans have responded and praised her for raising the makeover shift that is taking place in some areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X