వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ అనుమతులకు సింగిల్ విండో: తలసాని (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ పరిశ్రమకు అవసరమైన అనుమతులను సింగిల్‌విండో పద్ధతి ద్వారా అందించేవిధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చలనచిత్రాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు.

19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి అవసరమైన అన్నిరకాల ప్రోత్సాహకాలను అందించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పుణె, చెన్త్నెలలోని ప్రతిష్ఠాత్మక చలనచిత్ర శిక్షణ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని సీఎం చెప్పినట్లు తెలిసింది.నవంబర్ 14నుంచి 20వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను తెలంగాణ ఘనత చాటిచెప్పేలా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

బాలల చలనచిత్రోత్సవాలు..

బాలల చలనచిత్రోత్సవాలు..

నవంబర్ 14న లలిత కళాతోరణంలో ప్రారంభమయ్యే బాలల చలన చిత్రోత్సవాలు 20న ముగుస్తాయని, చివరిరోజు జ్యూరీ ఎంపిక చేసిన బాలల చిత్రాలకు అవార్డులను ప్రదానం చేస్తామని తలసాని చెప్పారు.

మరో మూడు నగరాల్లో కూడా..

మరో మూడు నగరాల్లో కూడా..

బాలల చిత్రోత్సవాలను హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లలో కూడా నిర్వహించే ఆలోచన ఉందని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ బీపీ ఆచార్య తెలిపారు.

ప్రభుత్వ పథకాలు కూడా..

ప్రభుత్వ పథకాలు కూడా..

గ్రామజ్యోతి, కాకతీయ మిషన్ వంటి ప్ఱభుత్వ పథకాల ప్రచారానికి సినీ పరిశ్రమ ముందుకు రావాలని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.

సమావేశంలో వీరు..

సమావేశంలో వీరు..

సమీక్ష సమావేశంలో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ ప్రత్యేక అధికారి జీ కిషన్‌రావు, సమాచారశాఖ డైరెక్టర్ వీ సుభాష్ పాల్గొన్నారు.

English summary
Telangana minister Talasani Srinivas Yadav said that single window system will be introduced to grant sanctions to film world in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X