Big Boss Telugu 5: అక్కినేని అందగాడి మెస్మరైజింగ్‌కు లహరి షారీ గ్లామర్ డోస్ ఎక్స్‌ట్రా

హైదరాబాద్: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని అందగాడు నాగార్జున.. హోస్ట్‌గా అదరగొట్టాడు. ఫస్ట్ లుక్‌లోనే ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. బిగ్ బాస్ హౌస్‌లో వీక్షకులను తనతో పాటు తీసుకెళ్లేలా చేయగలిగాడు నాగ్. సీజన్ 5 కంటెస్టెంట్లను పరిచేయం చేయడంలో అదే జోరును కొనసాగించాడు.

సిరి హనుమంతోతో బోణీ..

సిరి హనుమంతోతో బోణీ..

ఫస్ట్ కంటెస్టెంట్‌గా సిరి హనుమంతు (Sirihanmanth, Siri hanmanth)ను డయాస్ మీదికి వచ్చింది. భూమి బద్దలు సాంగ్‌తో ఆమె ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఎవరే నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియళ్లతో సిరి హనుమంతు ఇప్పటికే ప్రతి ఇంటికీ పరిచయమైంది. మేడమ్ సార్, మేడమ్ అంతే, రామ్‌లీల వంటి కొన్ని కొన్ని యూట్యూబ్ షోస్‌తో కూడా ఆమె బాగా పాపులర్ అయింది. ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

నాగార్జున రికార్డ్..

నాగార్జున రికార్డ్..

హోస్టింగ్ విషయంలో అక్కినేని నాగార్జున సరికొత్త రికార్డ్ సృష్టించినట్టయింది. హోస్ట్‌గా ఆయనకు ఇది మూడో సీజన్. ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత నేచురల్ స్టార్ నాని.. హోస్ట్‌గా కొనసాగలేకపోయారు.. వేర్వేరు కారణాల వల్ల. నాగార్జున మాత్రం కంటిన్యూ అవుతోన్నాడు. హోస్ట్‌గా మూడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఏ ఏడాదికి ఆ ఏడాది, ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో ఫుల్ ఎనర్జీతో కనిపిస్తోన్నారు. బిగ్ బాస్‌ రియాలిటీ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

 వీజే సన్నీ..

వీజే సన్నీ..

సెకెండ్ కంటెస్టెంట్‌గా వీజే సన్నీ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ అయ్యాడు. కల్యాణ వైభోగమే మూవీతో అతను వెండితెరకు పరిచయం అయ్యాడు. జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షో హోస్ట్‌గా వ్యవహరించాడతను ఇదివరకు. అనంతరం కొన్ని న్యూస్ ఛానళ్లలో రిపోర్టర్‌గా పని చేశాడు. ఎక్కువగా పేజ్ 3, లైఫ్‌స్టైల్, నైట్ లైఫ్‌ను కవర్ చేసేవాడు. అదే తరహాలో పేజ్ 3 సెలెబ్రిటీస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించడంతో మరింత లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. కల్యాణ్ వైభోగమే మూవీలో జై క్యారెక్టర్‌లో కనిపించాడీ యంగ్ అండ్ డైనమిక్ పేజ్ 3 జర్నలిస్ట్.

Recommended Video

    Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Oneindia Telugu
    గ్లామరస్ డాల్ లహరి

    గ్లామరస్ డాల్ లహరి

    మూడో కంటెస్టెంట్‌గా లహరి శారీ ఇంట్రడ్యూస్ అయ్యారు. తన కలల జీవితాన్ని వివరిస్తూ ఆమె డయాస్ మీదికి వచ్చారు. లహరి కూడా మీడియా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే వచ్చారు. సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంతో వెలుగులోకి వచ్చారు. 2016లో విడుదలైన సారి నాకు పెళ్లైంది మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకూ ఆమె పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డిలో నర్సు పాత్రలో కనిపించారు లహరి శారీ. బిగ్ బాస్ హౌస్‌ను ఆమె మరింత గ్లామరస్‌గా మార్చుతారనడంలో సందేహాలు అక్కర్లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+