Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ: అందుకే..: షన్నుతో రిలేషన్‌షిప్‌పై సిరి

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలె రసవత్తరంగా సాగుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందరూ మళ్లీ ఒకేచోటికి చేరుకున్నారు. తళుక్కున మెరిశారు. తమ ఆటపాటలతో ఫినాలెను మోతెక్కించారు. టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, రణ్‌‌బీర్ కపూర్, ఆలియాభట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

కాంట్రవర్సీకి కేంద్రబిందువైన కంటెస్టెంట్లు..

కాంట్రవర్సీకి కేంద్రబిందువైన కంటెస్టెంట్లు..

ఈ సీజన్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు షణ్ముఖ్ జశ్వంత్-సిరి హన్మంత్. కాంట్రవర్సీకీ కేంద్రబిందువువయ్యారు. ఏడెనిమిది వారాలుగా వారి మధ్య నడిచిన ట్రాక్‌ మీదే అందరి దృష్టీ నిలిచింది.. సోషల్ మీడియా వేదికగా హాట్ డిబేట్ సాగింది. షన్ను-సిరి రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే గాసిప్స్ ఊపందుకున్నాయి. జోరుగా సాగాయి. సిరి హన్మంత్ తల్లి సైతం తన కుమార్తెకు సున్నితంగా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. కంటెస్టెంట్లు.. హౌస్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌ను కలుసుకునే సమయంలో సిరి తల్లి ఈ హెచ్చరించారు. షన్నుతో రిలేషన్‌షిప్‌పై మందలించారు. షన్నుతో హగ్ నచ్చట్లేదంటూ తేల్చేశారు.

ఎమోషనల్ ఫీల్..

ఎమోషనల్ ఫీల్..

ఆ తరువాత షన్ను-సిరి క్లోజ్ ఫ్రెండ్.. మాజీ కంటెస్టెంట్ జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ సైతం ఇదే ప్రశ్నను సంధించారు. జెస్సీ అడిగిన ప్రశ్నకు కూడా ఒకేరకమైన సమాధానం ఇచ్చారు సిరి. తాను త్వరగా ఎమోషనల్ అయిపోతుంటానని, షన్నుతో స్నేహం మాత్రమే ఉందనీ చెప్పారు. బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని వారాలుగా షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంతు చాలా క్లోజ్‌గా ఉంటోన్నారనేది బహిరంగ రహస్యం. చాలా ఎపిసోడ్స్‌లో ఇది స్పష్టమైంది కూడా. షన్ను వెంటే సిరి అన్నట్టుగా కనిపించారు వారిద్దరు.

సిరి అవుట్..

సిరి అవుట్..


దీనిపై సిరి క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఆమె ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ కోసం టాప్ 5లో నిలిచిన ఏకైక ఫిమెల్ కంటెస్టెంట్ ఆమె. ఆశించిన ఓట్లు పడకపోవడంతో- ఈ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి అటెండ్ అయిన హీరోయిన రష్మిక మందన, మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. ఎలిమినేట్ అయిన సిరిని బయటికి తీసుకొచ్చారు.

 షన్నుతో రిలేషన్‌షిప్‌పై..

షన్నుతో రిలేషన్‌షిప్‌పై..

హోస్ట్ అక్కినేని నాగార్జునతో తన బిగ్‌బాస్ అనుభవాలను పంచుకున్నారు. తాను ఇక్కడి దాకా రావడమే గొప్పగా భావించానని, అదే తనకు టైటిల్‌తో సమానమని అన్నారు. ఈ సందర్భంగా సిరి కొంత భావోద్వేగానికి గురయ్యారు. షణ్ముఖ్ జశ్వంత్ పేరు ఎత్తకుండా.. అతనితో తనకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి క్లారిటీ ఇచ్చారు. తనకు తండ్రి లేరని అన్నారు. తమను పెంచి పోషించడానికి తల్లి కూడా వ్యాపారపరంగా బిజీ కావడం వల్ల ఆమెతోనూ అటాచ్‌మెంట్ తక్కువేనని చెప్పారు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..

అలా తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదని సిరి చెప్పుకొచ్చారు. దీనితో తాను త్వరగా ఎమోషన్ అవుతుంటానని అన్నారు. ఆ భావోద్వేగం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తమది మధ్య తరగతి కుటుంబం అని, బిగ్‌బాస్ హౌస్‌లో తన ప్రవర్తన పట్ల తల్లిలో తన పట్ల ఎలాంటి వ్యతిరేక భావం లేకపోయినప్పటికీ.. బంధుమిత్రుల మాటలతో ప్రభావితం అయి ఉండొచ్చని అన్నారు. బంధువులు ఏది చెప్పినా.. తల్లి నమ్మి ఉండొచ్చని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+