బిగ్‌బాస్‌పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్: నాగార్జుననూ వదల్లేదు: నవ్వుతూనే పంచ్‌లు

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలె రసవత్తరంగా సాగుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందరూ మళ్లీ ఒకేచోటికి చేరుకున్నారు. తళుక్కున మెరిశారు. తమ ఆటపాటలతో ఫినాలెను మోతెక్కించారు. టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, రణ్‌‌బీర్ కపూర్, ఆలియాభట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నాగార్జున కీలకపాత్రలో నటించిన బాలీవుడ్ మూవీకి సంబంధించిన శివ లుక్‌ను ఆవిష్కరించారు. రణ్‌‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన మూవీ ఇది.

నాగార్జునపై పంచ్‌లు

నాగార్జునపై పంచ్‌లు

గ్రాండ్ ఫినాలె సందర్భంగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారందరితోనూ నాగార్జున మాట్లాడారు. విన్నర్ గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిరి హన్మంత్ తల్లి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు.. హోస్ట్ నాగార్జునను టార్గెట్‌గా చేసుకున్నారు. నవ్వుతూనే చురకలు అంటించారు. పంచ్‌లు విసిరారు. తన మనసులో మాట ఇప్పుడు, ఇక్కడ చెప్పవచ్చో, లేదో అంటూ సంశయించగా.. నాగార్జున చొరవ తీసుకున్నారు. చెప్పి తీరాల్సిందేనని కోరారు.

ఫిమేల్ కంటెస్టెంట్లకు

ఫిమేల్ కంటెస్టెంట్లకు


దీనితో- ఆమె బాంబు పేల్చారు. ఇప్పటిదాకా నాలుగు సీజన్లలో మేల్ కంటె్స్టెంట్లనే విన్నర్లుగా ప్రకటించారని, ఒక్కసారి కూడా మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నాగార్జునను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇప్పుడు కూడా టాప్-5లో ఉన్న ఏకైక ఫిమేల్ కంటెస్టెంట్ సిరి హన్మంత్ ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని ఆమె తల్లి పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సారైనా మహిళలకు బిగ్‌బాస్ విజేతగా నిలిచే అవకాశం ఇస్తారని ఆశించానని అన్నారు.

10 ఓట్లు వేయించగలుగుతానంతే..

10 ఓట్లు వేయించగలుగుతానంతే..

అనుకోని విధంగా ఎదురైన ఈ ప్రశ్నకు నాగార్జున కొంత బిత్తరపోయినట్టే కనిపించింది. సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. విన్నర్‌ను సెలెక్ట్ చేసేది తాను కాదని అన్నారు. వ్యూవర్స్ తమ ఓట్ల ద్వారా విజేతను ఎంచుకుంటారని అన్నారు. తన చేతుల్లో ఏదీ ఉండదని చెప్పారు. దీనికి ఆమె కల్పించుకుని- అంతా మీ చేతుల్లోనే ఉంటుంది.. అని తేల్చేశారు. తాను ఓ 10 ఓట్లు మాత్రమే వేయించగలుగుతానని నాగార్జున బదులివ్వడంతో- నవ్వులు విరబూశాయి.

 అందరిలోనూ ఇవే అనుమానాలు..

అందరిలోనూ ఇవే అనుమానాలు..

నిజానికి- అనుమానం అందరిలోనూ ఉంది. నాలుగు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లే విన్నర్‌గా నిలిచారు. శివబాలాజీ, కౌశల్ మందా, రాహుల్ సిప్లగంజ్, అభిజీత్ ఇప్పటదాకా టైటిల్‌‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు సన్నీ ఈ సీజన్ విన్నర్‌గా నిలుస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా ఫిమేల్ కంటెస్టెంట్లే ఎలిమినేట్ కావడం కూడా ఈ అనుమానాలను మరింత బలపరిచింది. తొలి వారం సరయు ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత వరుసగా ఉమాదేవి, లహరి షారీ హౌస్‌ను వీడారు.

నెక్స్ట్ సీజన్ ఎలా ఉండొచ్చు..

నెక్స్ట్ సీజన్ ఎలా ఉండొచ్చు..


నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్‌ను మినహాయిస్తే.. మళ్లీ వరుసగా ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, ఎలిమినేట్ అయ్యారు. యానీ మాస్టర్, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, ఆర్జే కాజల్ టాప్ 5 లోకి చేరుకోలేకపోయారు. సిరి హన్మంత్ మాత్రమే టైటిల్ రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వీజే సన్నీ వైపే నెటిజన్లు మొగ్గు చూపుతున్నారు. వచ్చే సీజన్ ఎలా ఉంటుంది?, ఫిమేల్ కంటెస్టెంట్లు విన్నర్‌గా ఆవిర్భవిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+