దూరంగా భర్త: రాజయ్య ఫ్యామిలీతో కోడలు సారికకు గొడవలు
వరంగల్: కాంగ్రెసు వరంగల్ లోకసభ అభ్యర్థి రాజయ్య కోడలు సారికకు చాలా కాలంగా కుటుంబ సభ్యులతో గొడవలున్నాయి. రాజయ్య కుమారుడు అనిల్ సారికను 2006 ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత అనిల్ సారికకు దూరంగా ఉంటున్నాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదని స్థానికులు అంటున్నారు.
తన మామ రాజయ్య, భర్త అనిల్ తనను వేధిస్తున్నారంటూ సారిక గతంలో ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. రాజయ్య పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో ఇది జరిగింది. రాజయ్య కుటుంబ సభ్యులపై 498 సెక్షన్ కింద సారిక కేసు కూడా పెట్టారు.

రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ ఒక ఇంట్లో ఉంటారని, సారిక తన ముగ్గురు పిల్లలతో మరో ఇంట్లో ఉంటారని తెలుస్తోంది. సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటే శవాలు వంటింట్లో ఉండాలని అంటున్నారు. ఇంటికి కూడా ఏ విధమైన నష్టం జరగలేదని అంటున్నారు.
సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని స్థానికులు అంటున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో ఇంట్లో గొడవలు మాత్రం లేవని పనిమనిషి అంటోంది. రాజయ్య ఇంటికి క్లూస్ టీమ్‌లు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications