శిరీషది ఆత్మహత్యే,అనుమానాలుంటే నివృత్తి చేస్తాం, రేప్ జరిగిందా? లేదా? ఫోరెన్సిక్ తర్వాతే: డీసీపీ
శిరీషది ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.శిరీషది ఆత్మహత్యేనని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నానయిన తెలిపారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. శిరీషది ఆత్మహత్యేనని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నానయిన తెలిపారు.
సంబంధికులకు ఎవరికైనా అనుమానాలు ఉంటే తమ వద్దకు రావాలని, వారి అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. కుకునూరుపల్లి ఎస్ఐ క్వార్టర్స్‌లోనే ఈ వ్యవహారమంతా జరిగిందని డీసీపీ వేంకటేశ్వరరావు తెలిపారు.

స్టేషన్ క్వార్టర్స్‌లో కాకుండా ఫాంహౌజ్‌లో జరిగిందన్న ప్రచారం నిరాధారమని ఆయన అన్నారు. శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వెల్లడిస్తామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.












Click it and Unblock the Notifications