Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్లియర్: శిరీష ఫాంహౌస్ కు వెళ్లలేదు, ఆ లొకేషన్ ఎస్సై క్వార్టర్స్ దే: వెస్ట్ జోన్ డీసీపీ

బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

చదవండి: అది కచ్చితంగా హత్యే, సంచలన విషయాలు వెల్లడించిన శిరీష బాబాయి

కుకునూర్ పల్లిలోని ఫాంహౌస్ కు శిరీష వెళ్లిందన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. ఆ రోజు రాత్రి 11.20 గంటలకు రాజీవ్ కారు ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ కు మాత్రమే వెళ్లిందని, మళ్లీ 2.05 గంటలకు క్వార్టర్స్ నుంచి తిరిగి బయటకు వచ్చిందని చెప్పారు.

beautician-sirisha

ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తెల్లవారుజామున 1.48 గంటలకు శిరీష తన భర్త సతీష్ కు షేర్ చేసిన లొకేషన్ ఎస్ఐ క్వార్టర్స్ దేనని, ఈ విషయాన్ని ఎయిర్ సెల్ అధికారులు కూడా ధ్రువీకరించారని చెప్పారు.

అంతేకాకుండా ఆ రోజు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, రాజీవ్, శ్రావణ్, శిరీష లకు ఫుడ్ సరఫరా చేసిన హోంగార్డు భిక్షపతిని కూడా తాము విచారించామని, ఈ ఆధారాలన్నీ శిరీష ఎస్సై క్వార్టర్స్ కే తప్ప ఇంకెక్కడికీ వెళ్లలేదని నిర్ధారిస్తున్నాయని ఆయన వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+